E-Paper
Advertisement

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా
Advertisement

Teen Comedy Road Trip Movie: ఒక హైస్కూల్ బ్యాండ్‌కు ఏకంగా గ్రీన్ డే కచేరీలో ఓపెనింగ్ యాక్ట్ చేసే అవకాశం వచ్చిందంటే… ఆ కుర్రాళ్ల ఆనందానికి హద్దులు ఉంటాయా ? కానీ అసలు ఆ అవకాశం నిజం కాకపోతే ? సరదాగా చేసిన ఓ ప్రాంక్‌ ను నిజమని నమ్మి, ముగ్గురు టీనేజర్లు కారును తీసుకుని వేల మైళ్ల దూరంలో ఉన్న లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరితే ? దారిలో పోలీసులు, వింత మనుషులు, అనుకోని ప్రమాదాలు ఎదురైతే ? చివరికి తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటి ? ఈ క్రేజీ జర్నీని కామెడీ, మ్యూజిక్, టీనేజ్ ఎమోషన్స్‌తో చూపించే సినిమానే ‘నిమ్రాడ్స్’ (Nimrods). మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ లో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

టామీ, అతని ఇద్దరు స్నేహితులు హైస్కూల్‌ లో ఓ చిన్న మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటారు. పెద్ద మ్యూజీషియన్లుగా ఎదగాలన్నది ముగ్గురి కల. ఇప్పటి వరకు వాళ్ల సంగీత ప్రయాణం స్కూల్ స్థాయిలోనే ఉన్నా, ఒకరోజు వచ్చిన ఓ ఫోన్ కాల్ వాళ్ల జీవితాలను ఒక్కసారిగా మార్చేసిందనుకుంటారు. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ప్రముఖ గ్రీన్ డే కచేరీలో తమ బ్యాండ్‌ను ఓపెనింగ్ యాక్ట్‌గా ఎంపిక చేశారని టామీకి ఫోన్‌లో చెబుతారు. ఇంత పెద్ద అవకాశం తమకు వచ్చిందన్న ఆనందంలో అతను మునిగిపోతాడు.

Advertisement

కానీ ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు నిజం అతనికి తెలియదు. టామీని ఆటపట్టించేందుకు అతని అన్నయ్య వేన్ వేసిన ప్రాంక్ అది. టామీకి మాత్రం అది నిజమే అనిపిస్తుంది. జీవితంలో ఇంతకంటే గొప్ప అవకాశం రాదనుకున్న అతను వెంటనే యాక్షన్‌లోకి దిగుతాడు. అన్నయ్య కారును తీసుకుని తన ఇద్దరు బ్యాండ్ స్నేహితులతో కలిసి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరుతాడు. కాన్సాస్ సిటీ నుంచి మూడు రోజుల్లో లాస్ ఏంజిల్స్ చేరుకోవాలనేది వారి టార్గెట్. ప్రయాణానికి సరైన ప్లాన్ లేకపోయినా, తమ కలను చేరుకోవాలన్న ఉత్సాహం మాత్రం వాళ్లలో పుష్కలంగా ఉంటుంది.

అలా మొదలైన రోడ్ ట్రిప్ కొద్దిసేపటికే గందరగోళంగా మారుతుంది. దారిలో పోలీసుల నుంచి తప్పించుకోవడం, అనుకోని వ్యక్తులతో గొడవలు, వింత పరిస్థితుల్లో చిక్కుకోవడం, ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు… ఇలా ఒక్కో సంఘటన వాళ్ల ప్రయాణాన్ని మరింత పిచ్చెక్కిస్తుంది. వాళ్లకు కావాల్సింది మాత్రం ఒక్కటే… ఎలాగైనా లాస్ ఏంజిల్స్ చేరుకుని గ్రీన్ డే ముందు స్టేజ్ ఎక్కాలి. ఈ ప్రయాణంలో ఒక అమ్మాయి కూడా వారి వెంట చేరుతుంది. ఆమె రావడంతో ముగ్గురు స్నేహితుల మధ్య ఇప్పటికే ఉన్న గందరగోళానికి మరో కొత్త కోణం వస్తుంది. రోడ్ ట్రిప్ సాగుతున్న కొద్దీ స్నేహం, ప్రేమ, సంగీతంపై ఉన్న కలలు, కుటుంబ సంబంధాలు కూడా కథలో భాగమవుతాయి.

Advertisement

ఎట్టకేలకు లాస్ ఏంజిల్స్ చేరుకున్న తర్వాత అసలు బాంబ్ పేలుతుంది. గ్రీన్ డే కచేరీలో ఓపెనింగ్ యాక్ట్ అవకాశం తమకు రాలేదని, తాము ఇంతదూరం రావడానికి కారణమైన ఫోన్ కాల్ మొత్తం ప్రాంక్ అని వాళ్లకు తెలుస్తుంది. ఎన్నో కష్టాలు పడి వేల మైళ్లు ప్రయాణించిన తర్వాత ఈ నిజం తెలియడంతో వాళ్లకు గట్టి షాక్ తగులుతుంది. అయితే ఆ నిరాశే వారి ప్రయాణానికి ముగింపు కాదు. నిజమైన గ్రీన్ డే బ్యాండ్‌ను కలుసుకునే అవకాశం ఎలా వచ్చింది ? తమ మ్యూజిక్ కలను వదిలేశారా ? లేక ఈ విచిత్రమైన ప్రయాణమే వాళ్లకు కొత్త దారిని చూపించిందా ? అన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తారు.

ఏ ఓటీటీలో ఉందంటే?

‘నిమ్రాడ్స్’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 15 నుంచి ఓటీటీలో రెంట్ కి కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్షీషు ఆడియోతోనే సినిమా లభిస్తోంది. నిజ జీవితంలో గ్రీన్ డే సభ్యులు చేసిన ప్రారంభ రోజుల వ్యాన్ ప్రయాణాల నుంచి ప్రేరణ పొందిన ఈ కథలో బ్యాండ్ సభ్యులు Billie Joe Armstrong, Mike Dirnt, Tré Cool సహ-నిర్మాతలుగా ఉండటంతో పాటు అతిథి పాత్రల్లోనూ కనిపిస్తారు. మ్యూజిక్, టీనేజ్ కామెడీ, ఫ్రెండ్‌షిప్, రోడ్ ట్రిప్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ‘నిమ్రాడ్స్’ మంచి టైమ్‌పాస్ మూవీ. ముఖ్యంగా గ్రీన్ డే మ్యూజిక్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: కాశీ యాత్ర నేపథ్యంలో సాగే వినోదాత్మక ప్రయాణం… నవ్వులు పూయించే తెలుగు క్లాసిక్ కామెడీ డ్రామా

Related News

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

Big Stories

Advertisement
×