E-Paper
Advertisement

Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి తెలుసుకుంటే ఈ కేసు తీవ్రత ఏంటో అర్థమవుతుందని, ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఈ దేశంలో చట్టప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు తన ఫోన్‌ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల్లో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్‌ను ఒక ఆయుధంగా వాడుకుందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, సినిమా నటీమణులు మరియు వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని మండిపడ్డారు.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన చర్య అని, ఇందులో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. అరెస్టయిన అధికారులు ఇస్తున్న వాంగ్మూలం ఆధారంగానే విచారణ ముందుకు సాగుతోందని, ఇది ఏమాత్రం రాజకీయ వేధింపు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయ వేధింపులకు పాల్పడాలనుకుంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని జైలుకు పంపే వాళ్ళమని, విచారణ కోసం రెండేళ్ల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే ప్రభాకర్ రావు వంటి వారు విదేశాల్లో దాక్కుంటున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.

Read Also:  పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!

Related News

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×