E-Paper
Advertisement

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు
Advertisement

Crime Thriller: అడవుల మధ్య ప్రశాంతంగా జీవించే ఓ వ్యక్తి. తేనెటీగల పెంపకం, మ్యూజిక్… ఇదే అతని ప్రపంచం. అతని జీవితంలోకి కొన్ని ఏళ్ల తర్వాత ఒకప్పుడు తనతో ఉన్న అమ్మాయి తిరిగి వస్తే ? ఇద్దరూ కలిసి తేనె వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేయాలని కలలు కంటున్న సమయంలో, అదే వ్యాపారం వెనుక దాగి ఉన్న క్రైమ్ నెట్‌వర్క్ వారి జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ? పోలీసుల సహాయం కూడా అంతంతమాత్రంగానే ఉన్న ప్రాంతంలో తమ ప్రాణాలతో పాటు తమ జీవన విధానాన్ని కాపాడుకోవాల్సి వస్తే ? ఇలాంటి గ్రామీణ నేర ప్రపంచాన్ని నియో-వెస్ట్రన్ టచ్‌తో చూపించే క్రైమ్ థ్రిల్లర్ ‘ది రైవల్స్ ఆఫ్ అమ్జియా కింగ్’ (The Rivals of Amziah King).

కథలోకి వెళ్తే…

అమెరికాలోని ఓక్లహోమా గ్రామీణ ప్రాంతం, చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, చిన్న చిన్న కమ్యూనిటీలు… ఈ నేపథ్యంలో ఆమ్జియా కింగ్ జీవితం సాగుతుంటుంది. ఆ ప్రాంతంలో అతనంటే చాలామందికి గౌరవం. అతను కేవలం తేనెటీగల పెంపకందారుడు మాత్రమే కాదు. అద్భుతంగా బ్లూగ్రాస్, ఫోక్ మ్యూజిక్ వాయించే సంగీతకారుడు కూడా. తేనెటీగల పెంపకం ద్వారా మంచి నాణ్యత కలిగిన తేనెను తయారు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు.

Advertisement

అయితే ఆమ్జియా జీవితంలో చాలాకాలంగా ఒక ఖాళీ ఉంటుంది. చిన్నప్పుడు తనతో ఉన్న పెంపుడు కూతురు కతేరి ఎన్నో ఏళ్లుగా అతనికి దూరంగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమె మళ్లీ ఆమ్జియా జీవితంలోకి అడుగుపెడుతుంది. కతేరి తిరిగి రావడంతో అతని ప్రపంచమే మారిపోతుంది. కోల్పోయిన కుటుంబ బంధాన్ని తిరిగి పొందిన ఆనందంతో పాటు, ఇద్దరూ కలిసి తేనె వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటారు.

కానీ వాళ్ల కలలకు ఎక్కువ సమయం దక్కదు. ఆ ప్రాంతంలో ఆమ్జియా ఎదుగుదలను గమనిస్తున్న కొందరు ప్రత్యర్థులు అతని వ్యాపారంపై కన్నేస్తారు. మొదట తేనెటీగల పెట్టెలను దొంగిలించడం, వ్యాపారానికి నష్టం కలిగించడం వంటి ఘటనలతో మొదలైన సమస్య క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. ఆమ్జియా దగ్గర ఉన్న వనరులు, అతని ప్రభావం, స్థానికంగా ఉన్న పేరు.. ఇవన్నీ కొందరికి అడ్డంకిగా మారతాయి. పరిస్థితులు మరింత విషమించడంతో కతేరి కూడా వెనక్కి తగ్గదు. తన కుటుంబాన్ని, ఆమ్జియాను కాపాడుకోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగుతుంది. తేనె వ్యాపారం వెనుక జరుగుతున్న అక్రమాల గురించి ఆరా తీస్తూ వెళ్తున్న ఆమెకు, వారి తేనెను దొంగిలించి ఇతరులకు విక్రయిస్తున్న ఓ అవినీతి వ్యాపారవేత్త గురించి కీలకమైన సమాచారం తెలుస్తుంది.

Advertisement

ఇక్కడి నుంచి కథ ఒక తేనెటీగల పెంపకందారుడి వ్యాపార పోరాటంగా ఉండదు. ఆమ్జియా, కతేరి ఎదుర్కొంటున్న ప్రత్యర్థుల వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఏంటి ? వారి వ్యాపారాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? చట్టం, పోలీసుల సహాయం పరిమితంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇద్దరూ తమ జీవితం, కుటుంబం, సమాజాన్ని ఎలా కాపాడుకున్నారు ? అనే ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠగా సాగుతుంది.

తెలుగులో ఉందా ?

‘ది రైవల్స్ ఆఫ్ అమ్జియా కింగ్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఓటీటీలో మాత్రం ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్లీష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే చూడాల్సి ఉంటుంది. మాథ్యూ మెక్‌కానహే ప్రధాన పాత్రలో కనిపించడంతో పాటు, ఓక్లహోమా గ్రామీణ వాతావరణం, అడవులు, తేనెటీగల పెంపకం, స్థానిక కమ్యూనిటీ జీవితం.. ఇవన్నీ సినిమాకు ప్రత్యేకమైన టోన్‌ను తీసుకొస్తాయి.

Read Also: పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Related News

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×