E-Paper
Advertisement

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్
Advertisement

Biographical Comedy Drama: 19 ఏళ్ల వయసులోనే ఒక యువకుడు తన భవిష్యత్తు గురించి పెద్ద కలలు కంటాడు. రచయిత కావాలని ఆశపడతాడు. కానీ ఆ కల నెరవేరలేదని ఇంట్లో చెప్పుకోలేక అబద్ధం చెబితే ? ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మొదలైన ఆ అబద్ధం అతన్ని ఊహించని ప్రపంచంలోకి తీసుకెళ్తే ? అక్కడ ఒక రెస్టారెంట్ కిచెన్‌లో గిన్నెలు కడిగే స్థాయి నుంచి వంటవాడిగా ఎదిగి, తన జీవితాన్నే మార్చుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ? ఆ యువకుడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ కమింగ్-ఆఫ్-ఏజ్ కామెడీ డ్రామానే ‘టోనీ’ (Tony). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే… 

1975 వేసవిలో 19 ఏళ్ల ఆంథోనీ ‘టోనీ’ బోర్డైన్ వస్సార్ కాలేజీలో చదువుకుంటూ రచయిత కావాలని కలలు కంటుంటాడు. న్యూయార్క్‌ లో జరిగే ఓ రైటింగ్ ఫెలోషిప్ తనకు దక్కలేదనే విషయం తెలిసినా… కుటుంబ సభ్యులకు మాత్రం అది వచ్చిందని చెబుతాడు. తనపై నమ్మకం ఉన్న హైస్కూల్ ప్రియురాలు నాన్సీని కూడా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో అదే అబద్ధాన్ని కొనసాగిస్తాడు. నాన్సీ వేసవి సెలవుల కోసం మసాచుసెట్స్‌లోని ప్రొవిన్స్‌టౌన్‌కు వెళ్లడంతో టోనీ కూడా అక్కడికి చేరుకుంటాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి అతను ఊహించినట్టుగా ఉండదు.

Advertisement

నాన్సీ మరో వ్యక్తితో డేటింగ్ చేస్తోందని తెలుసుకుని నిరాశకు గురవుతాడు. చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో అక్కడే ఏదో పని చూసుకుని బతకాలని నిర్ణయించుకుంటాడు. అలా స్థానిక సీఫుడ్ రెస్టారెంట్ ‘ది ఫ్లాగ్‌షిప్’లో ఫేక్ ఎక్స్పిరియన్స్ చూపించి డిష్‌వాషర్‌గా చేరతాడు. మొదట గిన్నెలు కడగడంతో మొదలైన అతని ప్రయాణం క్రమంగా రెస్టారెంట్ కిచెన్ ప్రపంచంపై ఆసక్తిని పెంచుతుంది. అక్కడ పనిచేసే కుక్ సాల్‌తో టోనీకి మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ డ్రగ్స్ అలవాటు, కోపం కారణంగా సాల్ ఉద్యోగం కోల్పోవడంతో టోనీకి వంట చేసే అవకాశం వస్తుంది.

అతనిలో ఉన్న ఆసక్తి, నేర్చుకోవాలనే తపనను రెస్టారెంట్ యజమాని, హెడ్ చెఫ్ జోస్ వాటెల్ గుర్తిస్తాడు. టోనీకి వంటలోని అసలు క్రమశిక్షణను నేర్పుతూ అతనికి మార్గదర్శిగా నిలుస్తాడు. కిచెన్‌లో పని చేయడం అంటే కేవలం రుచికరమైన వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదని, బాధ్యత, సమయపాలన, టీమ్‌వర్క్ కూడా ముఖ్యమని టోనీ అర్థం చేసుకుంటాడు. అయితే జీవితంలో మరో పెద్ద మలుపు వస్తుంది. నాన్సీని ఇంప్రెస్ చేయడానికి కిచెన్‌లో ఓ ప్రత్యేకమైన డిష్ తయారు చేసే ప్రయత్నంలో టోనీ చేసిన పొరపాటుతో భారీ గ్రీస్ ఫైర్ జరుగుతుంది. రెస్టారెంట్ లోపలి భాగం తీవ్రంగా దెబ్బతింటుంది.

Advertisement

ఒకవైపు చెఫ్‌కు భారీ నష్టం, మరోవైపు టోనీ చెప్పిన ఫెలోషిప్ అబద్ధం నాన్సీకి తెలిసిపోవడంతో అతని ప్రేమ కూడా దూరమవుతుంది. ఇక్కడే టోనీ తన తప్పులను నిజంగా అర్థం చేసుకుంటాడు. జరిగిన నష్టానికి పారిపోకుండా రెస్టారెంట్ రిపేర్ల కోసం బీచ్‌లో క్లామ్‌బేక్ ఈవెంట్ ఏర్పాటు చేసి డబ్బు సేకరించి చెఫ్‌కు అందిస్తాడు. ఈ సంఘటన అతనిలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తుంది. చివరికి న్యూయార్క్‌కు తిరిగి వచ్చిన టోనీకి అతని గురువు ఇచ్చిన సిఫారసు లేఖ కొత్త దారిని చూపిస్తుంది. అదే లేఖతో ప్రతిష్టాత్మక Culinary Institute of Americaలో చేరే అవకాశం అతనికి లభిస్తుంది. రచయిత కావాలన్న కలతో మొదలైన అతని ప్రయాణం వంటల ప్రపంచం వైపు మళ్ళాక ఏం జరిగింది ? భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చెఫ్‌గా అతను ఎలా ఎదిగాడు? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘టోనీ’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు ఆడియో మాత్రం లేదు. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతోనే చూడాల్సి ఉంటుంది. ఆంథోనీ బోర్డైన్ జీవితం, కిచెన్ ప్రపంచం, యువకుడి ఎదుగుదల, తప్పుల నుంచి నేర్చుకునే ప్రయాణం వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా, బయోగ్రాఫికల్ డ్రామాలు నచ్చేవారికి బెస్ట్ ఆప్షన్.

Read Also: సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Related News

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×