OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధియేటర్లలో సందడి చేసి, ఓటీటీలో కూడా అదరగొడుతోంది. దీనిని అక్కడ ఒక అరుదైన ‘మసాలా ఎంటర్‌టైనర్’గా చెప్పుకున్నారు. ఇందులో ‘డకాటియా బంశీ’ ‘బెహులా సుందరీ’వంటి పాటలు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. థియేటర్‌లో చూడని వాళ్ళు, ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోక వెళితే ..
స్టోరీలోకి వెళితే
బిక్రమ్ ఒక జూట్ మిల్ ను నడుపుతూ ఉండేవాడు. అతను ఒక హత్య కేసులో తప్పుడు ఆరోపణలను ఎదుర్కుంటాడు. అతని జీవితం సమాజంలో అన్నిరకాలుగా నాశనమవుతుంది. అందుకు గానూ బిక్రమ్ తన నైపుణ్యాలను ఉపయోగించి బ్యాంక్ దోపిడీలను ఎంచుకుంటాడు. ఇందులో అతను బహురూపీల (వివిధ వేషధారణలు ) నైపుణ్యాలను ఉపయోగించి దోపిడీలను చేస్తుంటాడు. ఈ దోపిడీలను అరికట్టడానికి SI సుమంతో ఘోషల్ అనే ఒక నిజాయితీ గల పోలీసు అధికారిని నియమిస్తారు. ఇతను బిక్రమ్‌తో ఒక ఉత్కంఠభరితమైన ఛేజ్‌లో పాల్గొంటాడు. సుమంతోకు కూడా కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అతని భార్య పరి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటుంది. మరొవైపు బిక్రమ్‌కు జిమ్లీ అనే పిక్ పాకెట్ చేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఈ మూవీ స్టోరీ బిక్రమ్, సుమంతో మధ్య ఒక క్యాట్-ఎండ్-మౌస్ గేమ్‌ను గుర్తుకు చేస్తుంది. చివరికి ఆ పోలీసు అధికారి బిక్రమ్ ను పట్టుకుంటాడా ? అతని దోపిడీలను అరికడతాడా ? ఈ మూవీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిల్ని ఆ పని చేసి మరీ చంపే కిల్లర్… వాడికి చుక్కలు చూపించే కళ్ళు కంపించని హీరో
జీ 5 (ZEE5) లో
ఈ విజిలెంట్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బహురూపీ’ (Bohurupi). 2024 లో విడుదలైన ఈ బెంగాలీ మూవీకి నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 1998 నుండి 2005 మధ్య కాలంలో, బెంగాల్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా స్టోరీ బిక్రమ్ ప్రమాణిక్ (శిబోప్రసాద్ ముఖర్జీ) అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. బిక్రమ్ రాక్షసుల ముసుగును ధరిస్తూ దోపిడీలు చేస్తుంటాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇది 2024 లో అత్యధిక వసూళ్లు సాధించిన బెంగాలీ చిత్రంగా నిలిచింది. 2025 మే 9 నుంచి జీ 5 (ZEE5) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.