Illu Illalu Pillalu Today Episode may 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ నాన్నకు దొరక్కుండా నాతోపాటు రెస్టారెంట్లో తిరగడం.. ఇదంతా నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నర్మదా ఫీలవుతుంది. నువ్వు మాట్లాడటానికి కూడా మీ నాన్న పర్మిషన్ తీసుకుంటావు అలాంటిది ఇంత దూరం ట్రైనింగ్ కోసం నాకు దగ్గరకు రావడం.. నాతో పటే రెండు రోజులు ఉండటం నాకు ఏదో మిరాకిల్ లాగే అనిపిస్తుంది. రెస్టారెంట్ కి తీసుకెళ్లాలన్నా మీ నాన్న పర్మిషన్ ఉండాలి అని అంటావు. డబ్బులు కూడా మీ నాన్న ఇవ్వాలని అంటావు. ఏది ఏమైనా కూడా ఈ మెమోరీస్ ని నేను అస్సలు మర్చిపోలేను అని సాగర్ అంటాడు. మనం దిగిన ఫోటోలు చాలా అద్భుతంగా వచ్చాయి కదా అని సాగర్ అంటాడు. అయితే సాగరు వాళ్ళ నాన్న ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు.. ఏంటి ఆలోచిస్తున్నావ్ అని సాగర్ ని అడుగుతుంది. కాదు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నా అని సాగర్ అంటాడు. మొత్తానికి ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తమ ఫోటోలు నీ ప్రేమకు చూపించాలని అంటుంది కానీ సాగర్ మాత్రం టెన్షన్ పడతాడు. ఈ ఫోటోలు అమ్మ చూస్తే పర్లేదు కానీ నాన్న చూస్తేనే నాకు తడిసిపోతుందని టెన్షన్ పడతాడు. ప్రేమకు పంపించిన ఫోటోలను శ్రీవల్లి చూస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. సాగర్ ఫోన్ ఎత్తడం లేదని రామరాజు తిడుతూ ఉంటాడు. కనీసం నీ కొడుక్కి ఫోన్ చేయాలన్న బుద్ధి కూడా లేదా అని వేదవతిని రామరాజు తిడతాడు. శ్రీవల్లి ఫోన్ ఎందుకు చేయట్లేదు మావయ్య గారు ఫోటోలను పంపించింది కదా మీరు చూడలేదా ట్యాంక్ బండి దగ్గర చాలా బాగున్నాయి అంటూ ఇండైరెక్టుగానే అడ్డంగా ఇరికిచ్చేస్తుంది. ఏంటి నేను చెప్పిన పని పక్కన పెట్టేసి భార్యతో షికార్ చేయడానికి వెళ్ళాడా ఇదేనా నీ కొడుకు యవ్వారం అని వేదవతిని తిడతాడు రామరాజు. ఫుల్ ఖుషి అవుతుంది. ఇప్పుడు నా కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి నా కడుపులో మంట తగ్గింది అని మనసులో అనుకుంటుంది.
పక్కనే ఉన్న తిరుపతి అరె పెద్దోడా మీ ఆవిడకి ఏది చెప్పాలో కూడా తెలియదా ఇంత అమాయకురాలు ఏంట్రా అనేసి అడగగానే.. చాలా అమాయకురాలు మామ ఎలా బతుకుతారో ఏమో ఏది మనసులో దాచుకోదు అని చెప్పేస్తుంది అంటూ చందు అంటాడు.. ఇక రామరాజు తండ్రి కష్టపడుతున్నాడు అని కొంచెం కూడా లేదు. ఇది మాటంటే అసలు లెక్కలేదు. భారీ వచ్చిన తర్వాత తండ్రి మాట లెక్కచేయడం నీ కొడుకుకి ఇష్టంగా లేదనుకుంటాను అని వేదవతిని తిడతాడు. నేను ఎంత చెప్పినా కూడా మీరు వినరు ఏంటి స్వామి.. అయ్యో రామ తప్పు నాదే అంటారేంటి అని వేదవతి అంటుంది.
ఇక శ్రీవల్లి ప్రేమను అమ్మాయి చేత తిట్టించాలని ప్రేమ కూడా మిమ్మల్ని మోసం చేసిన చూశారా మావయ్య గారు.. ఎంతైనా ఆ ఇంటి అమ్మాయి కదా అనేసి శ్రీవల్లి అంటుంది. నా కట్టుకున్న భార్య నాకు నిజం చెప్పలేదు అలాంటిది నా శత్రువుల బిడ్డ అయినా ఈ అమ్మాయి నాకు నిజం ఎలా చెప్తుంది అనుకుంటాను నా ప్రేమ గాని అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి ఎంత చెప్తున్నా కూడా రామరాజు మాట కూడా కాదు కదా కనీసం మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో వంటగదిలోకి వెళ్లి డాన్స్ చేస్తుంది. ప్రేమ సీరియస్ గా వంటగదిలోకి వస్తుంది.
శ్రీవల్లి డాన్స్ వెయ్యడం చూసి అక్క నీకు కొంచమైనా ఉందా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నీకు తెలియదా.. లేదా కావాలనే నువ్వు ఇలా చేస్తున్నావా అని అనగానే శ్రీవల్లి కల్లబొల్లి నాటకాలు ఆడుతూ డ్రామాలు మొదలు పెడుతుంది. అయ్యో ప్రేమ మావయ్య గారిని మోసం చేయడం తప్పు కాదు ప్రేమ. నడిమతికి ఏం చెప్పారు డబ్బులు తీసుకురమ్మని చెప్పారు. కానీ ఆయన ఏం చేశాడు భార్యతో షికారు చేయడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మామయ్యకి కోపం రాదా.. నేను చెప్పినంత మాత్రాన మామయ్యకు కోపం వచ్చింది అనుకుంటున్నావా అని అరుస్తుంది.. రెండు రోజులు ఒంటరిగా భార్యతో ఎంజాయ్ చేసిన సాగర్ ఆ జ్ఞాపకాల నీ నెమరు వేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు.
ఇంట్లోకి రాగానే ప్రేమ వేదవతి అందరూ వాళ్ళని పలకరిస్తారు. కానీ రామరాజు ఫోన్ చేస్తాడు. అది చూడగానే సాగర్ టెన్షన్ పడతాడు.. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు రా అని రామరాజు అడుగుతాడు. నీకోసం ఇంత చేస్తున్నావ్ తండ్రి చెప్పిన మాటని కనీసం లెక్క చేస్తున్నావా నువ్వు అని నానా మాటలు తిడతాడు. రామ రాజన్న మాటలకి నర్మదా ఫీలవుతుందా? సాగర్ ఇంట్లోంచి నర్మదను తీసుకొని వెళ్ళిపోతాడా? శ్రీవల్లి ఇంకేదైనా చేస్తుందా..? అనేది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..