OTT Movie : సైకో కిల్లర్ సినిమాలకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. హాలీవుడ్ నుంచి మొదలుకొని, చిన్న ఇండస్ట్రీల దాకా ఈ సినిమాలను ఆదరించే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో అంధుడి పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. ఇతను గుడ్డివాడిగా ఉంటూనే, ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
గౌతమ్ (ఉదయనిధి స్టాలిన్) కి కంటి చూపు కనబడదు. అయితే సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. రేడియో జాకీ అయిన డాగిని (అదితి రావ్ హైదరి)తో ప్రేమలో ఉంటాడు. డాగిని కూడా గౌతమ్ ప్రేమను అంగీకరించే సమయంలో, ఆమెను ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ అయిన అంగులిమాలి (రాజ్‌కుమార్ పిచ్చుమణి) కిడ్నాప్ చేస్తాడు. ఈ కిల్లర్ మహిళలను హత్య చేసి, వారి తలలను ట్రోఫీలుగా సేకరిస్తాడు. డాగిని, అంగులిమాలికి సవాల్ విసురుతూ, గౌతమ్ తనను కనిపెట్టి నీఅంతు చూస్తాడని చెబుతుంది. దీంతో అంగులిమాలి ఆమెను చంపకుండా, ఏడు రోజులు అవకాశం ఇస్తాడు. గౌతమ్‌ను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. గౌతమ్ ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడే డాగిని కిడ్నాప్ అవుతుంది. ఆమె వేసుకున్న సెంట్ వాసనతో ఇక్కడ ఆమెకు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహిస్తాడు. పోలీసులకి కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోక పోవడంతో, కమల (నిత్యా మీనన్) అనే ఒక మాజీ పోలీసు అధికారి సాయంతో డాగినిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో అంగులిమాలి ఒక ధనవంతుడైన పిగ్ ఫామ్ యజమాని అని వీళ్ళు కనిపెడతారు. ఇంతలో గౌతమ్ స్నేహితుడు రాజనాయకం ఆ సైకో చేతిలో హత్యకు గురవుతాడు. కానీ గౌతమ్, కమల అతనికి భయపడకుండా, ఒక కళాశాల వీడియో రికార్డింగ్ ద్వారా అంగులిమాలిని గుర్తిస్తారు. చివరకు గౌతమ్ ఆ సైకోని ఎం చేస్తాడు ? డాగినిని కాపాడుతాడా ? సైకో వల్ల గౌతమ్ కి ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఆ సైకో అమ్మాయిల తలలను ఎందుకు వేరు చేసి చంపుతున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : యాక్షన్ సినిమాలో పొట్ట చెక్కలయ్యే కామెడీ… కడుపుబ్బా నవ్వించే తమిళ స్పోర్ట్స్ డ్రామా
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సైకో’ (psycho). 2020 లో విడుదలైన ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్, నిత్యామీనన్, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కుమార్ పిచ్చుమణి విలన్ గా నటించారు. ఈ సినిమాను 2021 లో తెలుగులో అదే పేరుతో డీఎస్ సినిమాస్ బ్యానర్ పై డి. శ్రీనివాస్ రెడ్డి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.