OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కామిడీ, సస్పెన్స్ తో ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ మూవీ నలుగురు వ్యక్తులచుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరోయిన్ వీళ్లపై ప్రతీకారం తీర్చుకుంటుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో ఆకట్టుకుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
సైనా ప్లే (Saina PLay) లో
ఈ మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘బూమరాంగ్’ (Boomerang). 2023 లో వచ్చిన ఈ మూవీకి మను సుధాకరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 24 ఫిబ్రవరి 2023 న థియేటర్లలో విడుదలైంది. దీనిలో సంయుక్త మీనన్, షైన్ టామ్ చాకో, చెంబన్ వినోద్ జోస్, బైజు సంతోష్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ చివరివరకూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సైనా ప్లే (Saina PLay) లో ఈ మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ నలుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. కురియాకోస్, జయదేవన్, రోనీ, జెర్రీ. వీరందరూ ఒక అందమైన మహిళ హనీని ఒక రొమాంటిక్ ప్రదేశంలో కలుస్తారు.ఆ తరువాత వాళ్ళు బంధీలుగా చిక్కుకుంటారు. స్టోరీ ఇప్పుడు గతానికి వెళ్తుంది. కురియాకోస్ ఒక స్త్రీలోలుడు, ఆర్థికంగా స్థిరమైన వ్యక్తి కావడంతో ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటాడు. ఒక పక్క పెళ్లి చేసుకుంటూ ఉండగానే, మరోపక్క అమ్మాయిలతో తిరుగుతుంటాడు. జయదేవన్ ఒక సబ్ఇన్‌స్పెక్టర్ నటన పట్ల ఇతనికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రోనీ ఎప్పుడూ శృంగార ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటాడు. జెర్రీ తన కాలేజీ క్రష్ పట్ల కాసిగా ఉంటాడు. ఈ నలుగురూ హనీ చేత కురియాకోస్ ఫ్లాట్‌లో బందీలుగా చిక్కుకుంటారు. సినిమా మొదటి సగంలో పాత్రల పరిచయం, వారి నేపథ్యాలను వివరించడంతో సాగుతుంది.
రెండవ సగంలో హనీ నిజంగా ఎవరో తెలుసుకునే క్రమంలో ప్రతీకార కథ ఒకటి వెలుగులోకి వస్తుంది. వీళ్ళంతా హనీ జీవితాన్ని తలక్రిందులు చేస్తారు. అందులో ఒకడు ఆమె వీడియొలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పెడతాడు. ఆతరువాత ఆమె పెళ్లి కూడా ఆగిపోతుంది. పెళ్లి కొడుకు వాళ్ళు ఆ వీడియొలను చూసి, పెళ్లి రద్దు చేసుకుంటారు. ఇలా జరగడంతో ఆమె తండ్రి అనారోగ్యం పాలవుతాడు. ఇలా ఆ నలుగురి వల్ల ఆమె జీవితం కోలుకోలేని స్తితికి వెళ్తుంది. వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్ళను హనీ తన అందంతో ట్రాప్ చేస్తుంది. ఒకరికి తెలీకుండా ఒకరిని ట్రాప్ చేసి , వాళ్ళందరిని బంధించి, ఎవరికీ చెప్పుకోలేని పనీష్మెంట్ ఇస్తుంది. చివరికి హనీ తన ప్రతీకారాన్ని పూర్తి చేస్తుందా? ఆ నలుగురికి ఎటువంటి శిక్ష విధిస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.