BigTV English
Advertisement

Balakrishna: ఒక్కరోజులో ‘ఆదిత్య 369’ సీక్వెల్ కథ పూర్తిచేశాం, త్వరలోనే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య

Balakrishna: ఒక్కరోజులో ‘ఆదిత్య 369’ సీక్వెల్ కథ పూర్తిచేశాం, త్వరలోనే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య

Balakrishna: అసలు సైన్స్ ఫిక్షన్ అనే జోనర్ తెలుగు ప్రేక్షకులకు తెలియక ముందే ‘ఆదిత్య 369’ (Aditya 369) అనే సినిమాను వారి ముందుకు తీసుకొచ్చారు బాలయ్య. కేవలం హాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలకే పరిమితమయిన సైన్స్ ఫిక్షన్ జోనర్‌ను దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు, హీరో బాలకృష్ణ (Balakrishna) కలిసి తెలుగు సినిమాకు పరిచయం చేశారు. అందుకే ‘ఆదిత్య 369’ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 35 ఏళ్లు అయినా కూడా చాలామంది ఆడియన్స్‌కు ఇంకా ఇది గుర్తుందంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దీని సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ అందించారు బాలయ్య.


అప్పట్లోనే అలా

‘ఆదిత్య 369’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలయ్యతో పాటు యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబూ మోహన్, నిర్మాత కూడా హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘ఆదిత్య 369’ రిలీజ్ అయినప్పటి బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. అసలు వారు మొదటిసారి ఈ సినిమాను ఎక్కడ చూశారో చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి అయితే తను తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యిందని, అప్పట్లోనే తను థియేటర్లలో ఈ సినిమాను 15,20 సార్లు చూశానని అన్నాడు.


నటనపై ప్రశంసలు

నిర్మాత సైతం ‘ఆదిత్య 369’ కథ ఎక్కడ మొదలయ్యింది, అసలు ఈ సినిమా తెరకెక్కించడానికి కారణాలు ఏంటని చెప్పుకొచ్చారు. అప్పట్లోనే ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ కథను నమ్మి, దీనిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యమే కారణమని బయటపెట్టారు. ఇక బాబూ మోహన్ సైతం ఈ సినిమా షూటింగ్ సమయంలో తను, బాలకృష్ణ కలిసి ఎంత అల్లరి చేశారో గుర్తుచేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ ‘ఆదిత్య 369’ బాలయ్య పోషించిన కృష్ణదేవరాయ పాత్ర గురించే ప్రశంసించారు. ఆ పాత్రలో బాలయ్య కూడా తన తండ్రి నందమూరి తారక రామారావు లాగా నటించారని పొగడ్తల్లో ముంచెత్తారు.

Also Read: చిరు 156 మూవీ ఆగిపోయినట్టేనా.. కారణం.?

సీక్వెల్ ప్లానింగ్

ఇక ఈ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ కూడా ‘ఆదిత్య 369’ సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో గుర్తుచేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, కానీ కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఈ సినిమా చేశానని తెలిపారు. ఇక 35 ఏళ్లు అయినా కూడా ఈ మూవీకి అంతే క్రేజ్ ఉండడంతో దీని సీక్వెల్‌కు కూడా ప్లానింగ్ అంతా ముగిసిందని బయటపెట్టారు. కేవలం ఒకేఒక్క రోజులో ‘ఆదిత్య 369’ సీక్వెల్ కథను పూర్తిచేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ తెలిపారు. దీంతో ఇప్పటినుండే ‘ఆదిత్య 369’ సీక్వెల్ కోసం ప్రేక్షకుల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. మొత్తానికి ఈ మూవీ 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×