BigTV English

Train Flight Tickets: విమాన, రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మరింత రీఫండ్ పొందచ్చు!

Train Flight Tickets: విమాన, రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మరింత రీఫండ్ పొందచ్చు!

నిత్యం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విమానం లేదంటే రైలు ప్రయాణం చేస్తుంటారు. ఖర్చు కాస్త ఎక్కువ అయినా ఫర్వాలేదు, త్వరగా ప్రయాణం చేయాలనుకునే వారు విమానంలో వెళ్తారు. తక్కువ ఖర్చుతో వెళ్లాలి అనుకునే వాళ్లు రైలు ప్రయాణం చేస్తారు. అయితే, కొన్ని అనివార్య కారణాలతో విమానం లేదంటే రైలు టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో టికెట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్, రీఫండ్ కు సంబంధించిన విషయాల గురించి ప్రయాణీకులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. టికెట్ క్యాన్సిలేషన్ సమయంలో ఆయా సంస్థలు ఎంత డబ్బు చెల్లిస్తాయో తెలుసుకోవడం వల్ల ప్రయాణీకులు మరింత రీఫండ్ పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. రీ ఫండ్ అనేది  ప్రయాణం చేసే క్లాస్, టికెట్ క్యాన్సిలేషన్ టైమ్ మీద ఆధారపడి మారుతూ ఉంటుంది.


రైలు టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ విధానం  

⦿ జనరల్ క్లాస్ టికెట్: రైలు బయల్దేరడానికి కనీసం 48 గంటల ముందు టికెట్ క్యాన్సిలేషన్ చేస్తే.. పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. 48 గంటల్లోపు చేసిన క్యాన్సిలేషన్ కు, క్యాన్సిలేషన్ ఛార్జ్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని అందిస్తారు.


⦿ స్లీపర్ క్లాస్ టికెట్: రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు రద్దు చేస్తే.. టికెట్ ధరలో 50% రీఫండ్ అందిస్తారు. ఆ తర్వాత చేస్తే వాపసు మొత్తం మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది.

⦿ AC క్లాస్ టికెట్: AC క్లాస్ టికెట్ల రద్దు ఛార్జీ ఎక్కువగా ఉంటుంది. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తేనే రీఫండ్ అందిస్తారు.

⦿ తత్కాల్ టికెట్: ఇక తత్కాల్ టికెట్ కు సంబంధించి రైలు రద్దు అయితేనే రీఫండ్ అందిస్తారు. లేదంటే రీఫండ్ పొందే అవకాశం ఉండదు.

విమాన టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ విధానం  

విమాన టికెట్ కు సంబంధించిన రూల్స్ ఆయా విమాన సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. అయినప్పటికీ టికెట్ క్యాన్సిలేషన్ కు సంబంధించి కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ విమాన రద్దు ఛార్జీ: విమానయాన సంస్థ టికెట్‌ ను రద్దు చేస్తే..  ప్రయాణీకులకు పూర్తి వాపసు లభిస్తుంది. అయితే, ప్రయాణీకుడు టికెట్ రద్దు చేస్తే.. విమానయాన సంస్థ క్యాన్సిలేషన్ ఛార్జీని కేటాయించుకుని రీఫండ్ ఇస్తుంది. అయితే, ఎంత రీఫండ్ ఇస్తారు అనేది ఆయా విమానయాన సంస్థను బట్టి ఉంటుంది.

⦿ బయల్దేరడానికి 24 గంటల ముందు క్యాన్సిలేషన్: విమానం బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే చాలా విమాన సంస్థలు పూర్తి రీఫండ్ అందిస్తాయి.

⦿ రీఫండ్ లభించని టికెట్లు: కొన్ని టికెట్లు ముఖ్యంగా తక్కువ ధర ఉన్న వాటికి రీఫండ్ అనేది ఉండదు.

రైలు, విమాన టికెట్ల క్యాన్సిలేషన్ రీఫండ్ అనేది నిర్దిష్ట పరిస్థితులను బట్టి మారుతుంది. అందుకే టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణీకులు రీఫండ్ తో పాటు టికెట్ క్యాన్సిలేషన్ వివరానలు పూర్తిగా చదవాల్సి ఉంటుంది.

Read Also: వెయింటింగ్ లిస్టు టికెట్ కన్ఫర్మ్ కావాలా? సింపుల్ గా ‘వికల్ప్ యోజన’ ట్రై చేయండి!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×