OTT Movie : థియేటర్లలో వస్తున్న సినిమాలు వారం నుంచి మొదలు పెడితే, నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికీ ఓటీటీ ఒక వేదికగా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. నచ్చిన సినిమాని, దొరికిన సమయంలో ఇంట్లోనే కూర్చుని హాయిగా చూసి ఆనందిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే, ఓటీటీలోనే ట్రెండ్ సెట్ గా నిలుస్తుంటాయి. బిగ్ స్క్రీన్ పై పెద్దగా రాణించని కొన్ని సినిమాలు, డిజిటల్ స్ట్రీమింగ్ లో టాప్ లేపుతుంటాయి. అలాంటి మూవీ ఒకటి ఓటీటీలో ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఆ సినిమాపేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఇప్పుడు మన చెప్పుకుంటున్న సినిమా, తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన ‘ఇడ్లీ కడై’. 2025అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించని ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఆడియన్స్ ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. అయితే దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేక పోయింది. డాన్ పిక్చర్స్‌తో కలిసి వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ ఈ తమిళ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు అరుణ్ విజయ్, సత్యరాజ్, పి.సముతిరకని, నిత్యా మీనన్, షాలిని పాండే, రాజ్‌కిరణ్, ఆర్.పార్తిబన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
మురుగన్ (ధనుష్) అనే అబ్బాయి ఒక చిన్న గ్రామంలో పుడతాడు. అతని తండ్రి శివనేశన్ (రాజ్ కిరణ్) ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఈ కొట్టులో ఇడ్లీ, చట్నీ, సాంబార్ సూపర్ టేస్ట్ గా ఉంటాయి. మురుగన్ చిన్నప్పటి నుండి ఇడ్లీ తయారీ చూస్తాడు. తండ్రి ఎప్పటినుంచో షాప్‌ను పెద్దగా చేయాలని కల కంటుంటాడు. మురుగన్ పెద్దయ్యాక మదురైలో కుకింగ్ కోర్సు చేస్తాడు. బ్యాంకాక్‌లో పెద్ద హోటల్‌లో చెఫ్ అవుతాడు. అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు అప్సరా (నిథ్యా మేనన్)ను ప్రేమిస్తాడు. ఈ సమయంలో ఒక రోజు తండ్రి హార్ట్ అటాక్‌తో చనిపోతాడు.
Read Also : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్
ఇప్పుడు ఇడ్లీ కొట్టు బాధ్యత మురుగన్ పై పడుతుంది. ఇంతలో ఆ ఊర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మారి (అరుణ్ విజయ్) ఈ షాప్‌ను కొనాలని ఒత్తిడి తెస్తాడు. డబ్బులు కూడా బాగా ఆఫర్ చేస్తాడు. కానీ మురుగన్ ఒప్పుకోడు. స్నేహితులు, అప్సరా సపోర్ట్ తో మురుగన్ తండ్రి రెసిపీ సీక్రెట్ యూజ్ చేసి ఇడ్లీ ఫేమస్ చేస్తాడు. ఇడ్లీ కొట్టు పెద్ద హోటల్‌గా మారుతుంది. మురుగన్, అప్సరా పెళ్లి కూడా అవుతుంది. మురుగన్ తండ్రి స్వర్గం నుంచి సంతోషంగా చూస్తాడు. ఈ సినిమా ఇలా హ్యాపీ ఎండింగ్ అవుతుంది.