Mega Verse Grand Launch: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఇదివరకే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం ద్వారా మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి చిరంజీవి హోస్ట్ గా మెగా వర్స్(Mega Verse) అనే టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో నెట్ ఫ్లిక్స్(Net flix) లో ప్రసారం కాబోతోంది. ఇలా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి హోస్ట్ గా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనే విషయం తెలియడంతో ఈ టాక్ షో పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తి అయినట్టు సమాచారం.
ఇక ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం కాబోతుందనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. తాజాగా ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ మెగా టాక్ షో నవంబర్ 30 వ తేదీ సాయంత్రం 4: 30 నిమిషాలకు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభం కాబోతోందని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెగా అభిమానులందరికీ ఆహ్వానం పంపిస్తున్నట్టు సమాచారం.
ఇలా మెగా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పాల్గొన్నట్టు తెలుస్తుంది. నాగార్జునతో పాటు అఖిల్, నాగచైతన్య కూడా మొదటి ఎపిసోడ్ లో సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇక వీరితో పాటు ప్రభుదేవా, ఎస్ ఎస్ తమన్, రవితేజ సూర్య, జ్యోతిక, ప్రభాస్, సందీప్ రెడ్డి లాంటి స్టార్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈ టాక్ షోపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ షో నవంబర్ 30వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాగా డిసెంబర్ మొదటి నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. మరి ఈ టాక్ షో ద్వారా చిరంజీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో కాకా సినిమా (Kaaka Movie ) పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..