Hyderabad Threat: హైదరాబాద్‌లో 26/11 ముంబై ఉగ్రదాడులను పునరావృతం చేస్తామంటూ ఉగ్రవాదుల బెదిరింపు మేయిల్స్ హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. ఇక వివారాల్లోకి వెలితే.. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈమెయిల్‌లో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు హెచ్చరికలు వచ్చాయి. దీంతో కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని మెయిల్ బెదిరింపులు కలకలం రేపాయి.
దాడిలో కనీసం 300 మందిని చంపడమే లక్ష్యమంటూ ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసుల తెలిపారు. దీంతో పోలీసలు అలర్ట్ అయ్యారు. తమ నాయకుడు లతీఫ్ భట్, ఇతర సహచరులను భారత సైన్యం హతమార్చినందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామని హెచ్చరికలు చేసారు. ఈ వార్తతో హైదరాబాద్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నుంచి నగర పోలీసు అధికారులకు అత్యవసర అలర్ట్ జారీ చేసారు.
ఇక హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భద్రత పెంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వదిలివెళ్లిన వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలింగ్, యాంటీ సబోటేజ్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచనలు చేశారు. అన్ని భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also read: వంకాయను ఇలా కాల్చి రోటి పచ్చడి చేస్తే.. రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు!