Actress Indraja: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సీనియర్ నటి ఇంద్రజ(Indraja) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంద్రజ జబర్దస్త్ (jabardasth) కార్యక్రమానికి జడ్జిగా కొనసాగారు .అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా ఈమె సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న ఇంద్రజ ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ అందరిని సొంత వారిలాగా చూసుకుంటూ ఉంటారు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ సైతం ఇంద్రజను అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఇంద్రజ తాజాగా జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్(Patas Praveen) కుమార్తెను చూడటం కోసం తన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తన కూతురిని చూడటానికి వెళ్లిన ఇంద్రజ అద్భుతమైన బహుమతి అందించారని తాజాగా ప్రవీణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా ఇంద్రజ గురించి మాట్లాడుతూ ఆమె తీసుకొచ్చిన కానుకులను కూడా అభిమానులకు చూపించారు. ఇంద్రజ గారిని తాను అమ్మ అని పిలుస్తానని ఆమె కూడా సొంత కొడుకులాగే తనని చూసుకుంటారని ప్రవీణ్ తెలిపారు.
నాకు పాప పుట్టిన రోజు తాను మొట్టమొదటిసారిగా ఇంద్రజ గారికి ఫోన్ చేసి పాప పుట్టిన విషయాన్ని చెప్పానని ప్రవీణ్ తెలిపారు. హాస్పిటల్లో ఉన్న సమయంలో పాపని చూడటానికి ఇంద్రజ గారికి కుదరకపోవడంతో స్వయంగా ఇంటికి వచ్చారని తెలిపారు. ఇక ఇంద్రజ గారు తన కూతురిని చూడటానికి వస్తూ పిల్లలకు అవసరమయ్యే అన్ని వస్తువులను తీసుకువచ్చినట్టు ప్రవీణ్ తెలిపారు. ఊయల నుంచి మొదలుకొని.. పాప కోసం ఉపయోగపడే డ్రెస్సులు, ఊయల, బేబీ బెడ్, టవల్స్, డైపర్స్, లోషన్స్ వంటి అత్యవసరమైన వస్తువులను కానుకగా తీసుకువచ్చారని వీటితోపాటు కొంత డబ్బును కూడా ఇచ్చారని ప్రవీణ్ తెలిపారు.
తన కుమార్తె కోసం ఇంద్రజమ్మ ఇచ్చిన ఈ కానుకలు చాలా విలువైనవని, ఇవి అలాగే భద్రంగా దాచి పెద్దయిన తర్వాత కచ్చితంగా ఇవి మీ అమ్మమ్మ తీసుకొచ్చినవని తన కూతురుకు చూపిస్తాను. అంటూ ఈ సందర్భంగా ప్రవీణ్ వంశిత తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పటాస్ ప్రవీణ్ తన ప్రేయసి వంశీతో ఈ ఏడాది మే నెలలో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లయిన తక్కువ సమయంలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.
Also Read: బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే?