E-Paper
Advertisement

తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!

తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!
Advertisement

Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు పార్టీ ముఖ్య సమావేశం జరుగుతుండగానే ఆయన ఇలా స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు

Advertisement

కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరుసగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరొకసారి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘నా ప్రయాణం ఆగదు.. నా పోరాటం ఆగదు… ప్రజల కోసం నా అడుగు వెనక్కి పడదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. తాను ఎవరికీ భయపడేది లేదని, ప్రజా సమస్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తన పోస్ట్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

గాంధీభవన్‌లో పీఏసీ భేటీ వేళ చర్చ

Advertisement

ఒకవైపు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక సమావేశం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఈ పరిణామంతో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య ఈ పోస్ట్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? అనే విషయంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

తెలంగాణ ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జ్ మొదటి ప్రసంగం.. ఏమన్నారంటే..?

తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

Big Stories

Advertisement
×