BigTV English

OTT Movie : ప్రియుడు చనిపోయాడు అనుకొని మరొకరిని ప్రేమించే ప్రియురాలు… పక్కా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్

OTT Movie : ప్రియుడు చనిపోయాడు అనుకొని మరొకరిని ప్రేమించే ప్రియురాలు… పక్కా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్

OTT Movie : కొన్ని సినిమాలు చూసినప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీల్ ఒక్కోసారి కళ్ళు చెమ్మగిల్లే వరకు వెళుతుంది. అటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఫ్యామిలీతో సహా చూసే విధంగా ఉంటాయి. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫీల్ గుడ్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘దియా’ (Dia). ఈ మూవీ ముగ్గురు వ్యక్తుల మధ్య నడుస్తుంది. హీరోయిన్ తను ప్రేమించిన వ్యక్తికి ఒక ప్రమాదం జరుగుతుంది. అతడు చనిపోయాడనుకొని మరొకరిని ప్రేమిస్తుంది హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ఫీల్ గుడ్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

దియా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంటుంది. ఆ కాలేజీలో మొదటి సంవత్సరంలో రోహిత్ జాయిన్ అవుతాడు. రోహిత్ ని చూడగానే దియా ప్రేమలో పడుతుంది. అతనికి ప్రేమ విషయం చెప్పడానికి భయపడుతూఉంటుంది. ఆ తర్వాత దియా ఇంటి దగ్గరే రోహిత్ నివాసం ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో రోహిత్ కి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతను చనిపోయాడని డాక్టర్లు చెబుతారు. దియా బాగా డిసప్పాయింట్ అయిపోతుంది. తను కూడా చనిపోవాలనుకుంటుంది. ట్రైన్ కింద పడి చనిపోవాలనుకునే సమయంలో, ఆమెకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక దొంగ ఈమె బ్యాగ్ ను దొంగలించి ఉంటాడు. ఆ దొంగను కొట్టి, ఆది అనే వ్యక్తి అందులో నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేస్తాడు. మళ్లీ తిరిగి వచ్చి తన బ్యాగ్ ని తీసుకుంటుంది దియా. అప్పుడు తన స్టోరీ ఆదికి చెప్తుంది. వీళ్ళిద్దరి మాటలు బాగా కలవడంతో అది ఈమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు.

ట్విస్ట్ ఏమంటే చనిపోయాడు అనుకున్న మొదటి ప్రేమికుడు మళ్ళీ తిరిగి వస్తాడు. ఇది చూసిన హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అతడు కోమాలో ఉండడం వలన బతికే అవకాశం తక్కువగా ఉండటంతో, డాక్టర్లు ఈమెతో చనిపోయాడని దియాకి చెప్తారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు పెద్దలు. ఆ సమయంలో దివ్య ఆదిని ప్రేమించిందనే విషయం రోహిత్ కి తెలుస్తుంది. చివరికి దివ్య ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఆది పరిస్థితి తర్వాత ఏమవుతుంది? రోహిత్ వీళ్ళ ప్రేమ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×