The Family Man 3 Web Series OTT: హారర్, స్పై థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండ ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేందుకు అమితాసక్తి చూపిస్తుంటారు. ఓటీటీలు వచ్చాక వీటికి ఆదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైంలో భారీ హైప్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘ది ఫ్యామిలీ మ్యాన్’. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చింది. ఈ రెండు సీజన్లు ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో పోలీసు ఆఫీసర్గా, ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ భాజ్పాయి నటన ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్గా మూడో పార్ట్ని కూడా తీసుకువచ్చారు. దీనిపై ఎప్పుడో ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ నోచుకోలేదు. కరోనా వల్ల వాయిదా పడ్డ ఈ సిరీస్ ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. తాజాగా దీనిపై అమెజాన్ ప్రైం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ని ప్రకటించింది అమెజాన్. కాగా ప్రియమణి, మనోజ్ భాజ్పాయిలతో విడుదల చేసిన ఈఈ వీడియో సరదాగా సాగుతుంది.
“నాలుగేళ్లలో తన ఇంట్లో ఏం జరిగిందనేది ప్రియమణి వివరిస్తుంటుంది. ఫస్ట్ తన పిల్లల గురిచ చెబుతూ ఆ తర్వాత తన భర్త పోలీసు ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ భాజ్పాయి) గురించి చెబుతూ నాలుగేళ్లుగా ఒకే పని చేస్తున్నాడంటూ సెటైరికల్గా చెప్పుకొస్తుంది. అప్పుడే అతడు మనోజ్ భాజ్పాయి నిద్రలేస్తూ అటూగా వస్తాడు. ఈ వీడియో మొత్తం అతడు అలాగే అంటూ కనిపిస్తాడు. చివరికి ఆ రహా హు మై (నేను వచ్చేస్తున్నాను) అని చెబుతుండగా ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది అమెజాన్. నవంబర్ 21 నుంచి మూడో సీజన్ ఓటీటీలో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
?utm_source=ig_web_copy_link
దీంతో ఈ సిరీస్ లవర్స్ అంత పండగ చేసుకుంటున్నారు. మనోజ్ భాజ్పాయి, ప్రియమణిలు ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ కశ్మీర్ ఉగ్రవాదం చుట్టూ తిరగగా.. రెండో సీజన్ శ్రీలంక ఎల్టీటీఈ (LTE) ఉగ్రవాదం నేపథ్యంలో సాగింది. ఈ రెండు సీజన్ భారీ విజయం సాధించాయి. ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కోసం నాలుగేళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన రావడంతో మూవీ లవర్స్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ప్రియులంత పండగ చేసుకుంటున్నారు. తొలి రెండు సీజన్లు ఉగ్రవాదం చూట్టు తిరగగా.. ఈ మూడో సీజన్ కరోనా వైరస్ మూలలు, డ్రాగన్ దేశం చైనా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.