BigTV English
Advertisement

OTT Movie : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : తక్కువ సమయంలో చుపించాల్సింది చూపించేస్తున్నారు. అందించావాల్సింది అందించాల్సింది అందిచేస్తున్నారు. అయ్యో తప్పుగా అనుకునేరు. నేను చెప్పేది షార్ట్ ఫిల్మ్స్ గురించి. అంటే ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఉన్నాయనుకోండి. సోషల్ మీడియాలో వీటి సందడి ఎక్కువగానే ఉంది మరి. తక్కువ బడ్జెట్ తో, డిఫీరెంట్ కంటెంట్ ఉండేలా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ షార్ట్ ఫిల్మ్స్ ట్రస్ట్ (నమ్మకం), డీసెప్షన్ (మోసం), (ఫియర్) భయం గురించి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక ఇంట్లోకి సూపర్‌ నాచురల్ శక్తి వచ్చే ప్రయత్నంలో ఈ స్టోరీ ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

ఎవరు అక్కడ? (who’s there ?) అనేది 2024లో విడుదలైన అమెరికన్ హారర్ షార్ట్ ఫిల్మ్. దీన్ని రయాన్ డోరిస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో గార్లాండ్ స్కాట్, కాలీ టేబర్ నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ 11 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.9/10 పొందింది. ప్రస్తుతం YouTubeలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

ఒక సిటీ శివార్లలో ఉండే ఇంట్లో రాత్రి సమయంలో ఈ కథ మొదలవుతుంది. డేవిడ్ అనే సింగిల్ ఫాదర్, తన టీనేజ్ డాటర్ బ్రూక్ కోసం వెయిట్ చేస్తూ, కిచెన్‌లో చీజ్ సాండ్‌విచ్‌లు తయారు చేస్తుంటాడు. ఆ రోజు రాత్రి సమయం 11:30 అవుతుంటుంది. బ్రూక్ ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడు డోర్‌ బెల్ రింగ్ అవుతుంది. బయట నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. ‘డాడ్, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చెయ్.” అనే వాయిస్ బ్రూక్‌లా అనిపిస్తుంది. కానీ డేవిడ్‌కు ఏదో తప్పు జరుగుతోందని ఫీల్ అవుతాడు. అతను డోర్‌ సందులో నుంచి చూస్తాడు. కానీ బయట ఎవరూ కనిపించరు. మళ్లీ వాయిస్ వస్తుంది. “డాడ్, ఇట్స్ మీ, ఓపెన్ ది డోర్.” డేవిడ్ భయపడతాడు. ఎందుకంటే వాయిస్ బ్రూక్‌లాగే ఉంది, కానీ టోన్ కొంచెం విచిత్రంగా ఉంది. అతను డోర్ ఓపెన్ చేయకుండా, లాక్ చేసి, ఫోన్ తీసి బ్రూక్‌కు కాల్ చేస్తాడు. బ్రూక్ “డాడ్, నేను ఇంకా రోడ్‌పై ఉన్నాను, 10 నిమిషాల్లో వస్తాను.” అని చెప్తుంది. దీంతో డేవిడ్ షాక్ అవుతాడు. బయట వాయిస్ బ్రూక్‌ది కాదని అర్థమవుతుంది. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంటాయి.


Read Also : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

డేవిడ్ భయపడి ఇంట్లో దాక్కుంటాడు. బయటి వాయిస్ మళ్లీ మళ్లీ “డాడ్, నీవు ఎందుకు ఓపెన్ చేయట్లేదు?” అని అడుగుతుంది. ఈ వాయిస్ స్లోగా మారుతుంది. మొదట బ్రూక్ వాయిస్, తర్వాత డేవిడ్ ఫ్రెండ్ వాయిస్, ఆ తర్వాత అతని డెడ్ వైఫ్ వాయిస్‌లా మారుతుంది. ఇది ఒక సూపర్‌ నాచురల్ శక్తి అని డేవిడ్‌కు అర్థమవుతుంది. ఇప్పుడు లైట్స్ ఆన్ ఆఫ్ అవుతాయి, విండోస్ వైబ్రేట్ అవుతాయి. డేవిడ్ భయపడి కిచెన్‌లో దాక్కుని కత్తి తీసుకుంటాడు. ఈ టైంలో బ్రూక్ నిజంగా ఇంటికి వస్తుంది. డేవిడ్ ఆమెను లోపలికి తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఆ దుష్ట శక్తితో ట్రాప్‌లో పడతారు. వీళ్ళు ఆ దుష్ట శక్తి నుంచి బయట పడతారా ? ఎందుకు అది డేవిడ్ ను టార్గెట్ చేసింది ? అనే విషయాలను, ఈ హారర్ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : పెళ్ళాల గొడవలతో దూరమయ్యే ప్రాణ స్నేహితులు… పిల్లలిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్… కితకితలెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ప్రతీ 5 నిమిషాలకు ఆ ఇంటెన్షన్ ఉన్న టెన్షన్ పెట్టే సీన్.. .సింగిల్స్ కు పండగే

OTT Movie : పిల్లల పెళ్ళిళ్ళను చెడగొట్టే దిక్కుమాలిన ఆచారం… కడుపుబ్బా నవ్వించే మలయాళం కామెడీ థ్రిల్లర్

OTT Movie : అడవిలో అంధుడి అరాచకం… 1 గంట 48 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈగోను శాటిస్ఫై చేసే మలయాళం రివేంజ్ డ్రామా

OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఈ వారం రాబోతున్న కొత్త మలయాళం సినిమాలు… ఆ మూడూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

OTT Movie : పట్టణం కింద దెయ్యాల ప్రపంచం… భయపడితే చంపేసే సైతాన్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు భయ్యా

Big Stories

×