OTT Movie : కామెడీ క్రైమ్ డ్రామాతో తెరకెక్కిన ఒక బాలీవుడ్ సిరీస్ టాప్ రేటింగ్ తో దుమ్ము లేపుతోంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ IMDBలో 8.5/10 రేటింగ్ ను పొందింది. ఇది క్రైమ్, రాజకీయాలు, కుటుంబ డైనమిక్స్‌ను కలుపుతూ, మరచిపోలేని ఒక వినోదాత్మక అనుభవాన్ని అందిస్తుంది. ఇది బిందియా అనే నగరంలో జరిగే ఒక అస్తవ్యస్తమైన మాఫియా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా వెంటనే ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి. తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘బిందియా కే బాహుబలి’ (Bindiya Ke Bahubali) ఒక హిందీ డార్క్ కామెడీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సౌరభ్ శుక్లా, రణవీర్ షోరే, సీమా బిస్వాస్, సాయి తమ్హంకర్, షీబా ఛద్దా, వినీత్ కుమార్, ఆకాష్ దహియా, సుశాంత్ సింగ్, తనిష్ఠా ఛటర్జీ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2025 ఆగస్టు 8 నుంచి Amazon MX Player లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏంటంటే
ఈ కథ బిందియా నగరంలో అందరూ భయపడే, బడా దావన్ (సౌరభ్ శుక్లా) అనే మాఫియా డాన్‌తో మొదలవుతుంది. అతను తన రాజకీయ కెరీర్‌ను ప్రారంభించబోతున్న సమయంలో సూపర్‌కాప్ మురళీ మంజీ అతన్ని అరెస్ట్ చేస్తాడు. దీంతో దావన్ కుటుంబంలో అధికారం కోసం గందరగోళం ఏర్పడుతుంది. బడా దావన్ జైలులో ఉండగా, అతని కుమారుడు ఛోటే దావన్ (రణవీర్ షోరే) కుటుంబ వ్యాపారాన్ని, అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఛోటే అసమర్థత, ప్రత్యర్థి గ్యాంగ్‌ల దాడులు, దురాశతో కూడిన మామ, కుటుంబంలోని అంతర్గత డ్రామా అతని ప్రయత్నాలను సవాలు చేస్తాయి.
Read Also : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?