OTT Movie : ఇండియన్ చిత్ర పరిశ్రమలు బాలీవుడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి స్టోరీలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాల్ మూవీ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కొత్తగా వచ్చే పనిమనిషి వల్ల ఈ ఫ్యామిలీలో కొంత అలజడి రేగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీ లలో
ఈ బెంగాలీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘దుర్గా సోహే’ (Durga Sohay). ఈ బెంగాలీ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ మూవీకి అరిందమ్ సిల్ దర్శకత్వం వహించగా, అవిషేక్ ఘోష్ దీనిని నిర్మించారు. ఈ మూవీ 28 ఏప్రిల్ 2017న విడుదలైంది. అమర్ ముజిక్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ బెంగాలీ మూవీ హాట్ స్టార్ (hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బెంగాల్ లో ఒక సంపన్న ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీకి హెడ్ గా దాదాజీ అనే వ్యక్తి ఉంటాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు దేవేందు, శోభు ఉంటారు. వీళ్లకు స్మిత, మానసి అనే భార్యలు కూడా ఉంటారు. వీళ్లంతా బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి కొద్ది రోజుల్లో దుర్గామాత ఫెస్టివల్ వస్తూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ కి ఫ్యామిలీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దుర్గ అనే అమ్మాయి దాదాజీని చూసుకోవడానికి వస్తుంది. దాదాజీకి వయసు ఎక్కువగా ఉండటం వల్ల కేర్ టేకర్ గా దుర్గని అపాయింట్ చేస్తారు. ఇలా అందరితో దుర్గ ఆ ఇంట్లో కలిసిపోతుంది. ఒకరోజు అందరూ నిద్రపోతున్న వేళ, బంగారు నగలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దుర్గ. మానస ఇది గమనించి ఆమెను పట్టుకుంటుంది. అప్పుడే స్మిత కూడా అక్కడికి వస్తుంది. అయితే దుర్గని మానస క్షమించి మళ్లీ పనిలో పెట్టుకుంటుంది. ఈ విషయం స్మితకి అస్సలు నచ్చదు.
ఆ తర్వాత అందరూ మానసిని నిందిస్తారు. దొంగతనం చేసిన మనిషి ని పనిలో మళ్ళీ ఎలా పెట్టుకుంటావని అడుగుతారు. ఇది తెలిసి దుర్గ పశ్చాత్తాపంతో మానసిని క్షమించమంటుంది. ఇంతలోనే స్మిత భర్త, ఒక చైన్ తెచ్చి దుర్గకు ఇచ్చి తనతో ఏకాంతంగా గడప మంటాడు. నేను అలాంటి దాన్ని కాదని చెప్తుంది దుర్గ. ఇంతలోనే స్మిత చైన్ కనపడలేదని దుర్గ పై అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు దుర్గ భర్త జైలు నుంచి వస్తాడు. దాదాజీ ఇంట్లో దొంగతనం చేయమని దుర్గకు చెప్తాడు. చివరికి దుర్గ ఆ ఇంట్లో మళ్ళీ దొంగతనం చేస్తుందా? ఆ కుటుంబాన్ని కాపాడుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘దుర్గా సోహే’ (Durga Sohay) అనే ఈ బెంగాలీ ఫ్యామిలీ డ్రామా మూవీని చూడండి.