OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటిటి వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ తో అదరగొడుతోంది. వీటిలో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక చైనీస్ యాక్షన్ థ్రిల్లర్. బాయ్ ఫ్రెండ్ ని కోల్పోయిన ఒక అమ్మాయి, చాలా ప్రమాదకరమైన విలన్ గా మారుతుంది. అ అమ్మాయి చేసే యాక్షన్ సీన్స్ చాలాబాగా ఆకట్టుకుంటాయి. ఈ చైనీస్ యాక్షన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
హాట్స్టార్ (hotstar) లో
ఈ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లైండ్ వార్’ (Blind war). కెప్టెన్ డాంగ్ ఒక మిషన్ విఫలం అవ్వడంతో, అక్కడ జరిగిన ఒక ప్రమాదంలో శాశ్వత దృష్టి లోపం వచ్చి చాలా బాధపడుటాడు. తన శత్రువు కూతురికి హాని చేస్తానని బెదిరించడంతో, అతను పదవీ విరమణ చేసి బయటకు వస్తాడు. ఈ యాక్షన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ హాట్స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జీనా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అక్కడ వీళ్ళ డాన్ ను అరెస్టు చేసి ఉంటారు. పోలీస్ స్టేషన్ కి వీళ్ళు రావడంతో డాన్ సంతోషపడతాడు. అతన్ని కాపాడడానికి వచ్చారనుకుంటే, పోలీస్ స్టేషన్లోనే బాంబ్ పెట్టి బాస్ ను లేపేస్తారు. జీనాను డాన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇలా చేస్తారు. వాళ్లను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో అక్కడికి వస్తాడు. హీరో కొంతమంది పోలీసులను తీసుకుని లోపలికి వెళ్తాడు. అక్కడ జీనా గ్యాంగ్ కు, పోలీసులకు బాగా ఫైరింగ్ జరుగుతుంది. ఆ ఫైరింగ్ లో హీరోకి కళ్ళు కూడా పోతాయి. జీనా బాయ్ ఫ్రెండ్ ఆ ఫైరింగ్ లో చనిపోతాడు. జీనాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. జీనా తన బాయ్ ఫ్రెండ్ ను కోల్పోవడంతో, ఆ పోలీస్ ఆఫీసర్ పై పగతో రగిలిపోతుంది. మరోవైపు హీరోకి తన కళ్ళు పోవడంతో, ఉద్యోగం కూడా పోతుంది.
అ తరువాత తన కూతుర్ని చూసుకుంటూ హ్యాపీగా గడపాలనుకుంటాడు. మరోవైపు జీనాని చంపాలని డాన్ కొడుకు వెయిట్ చేస్తుంటాడు. హీరోని చంపాలని జీనా కూడా వెయిట్ చేస్తుంటుంది. అయితే హీరో కళ్ళు లేకపోయినా, మనుషులను ఎదుర్కొనే విద్యలను చాలా నేర్చుకుంటాడు. అతడు చాలా ప్రమాదాలను అవలీలగా తప్పించుకుంటాడు. చివరికి జీనా హీరో పై పగ తీర్చుకుంటుందా? హీరో శాశ్వతంగా గుడ్డివాడు గానే ఉంటాడా ? డాన్ కొడుకు జీనాను ఎం చేస్తాడు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ హాట్స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లైండ్ వార్’ (Blind war) అనే ఈ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.