BigTV English
Advertisement

OTT Movie : వీడు మామూలోడు కాదు … అమ్మాయిల్ని టార్గెట్ చేసి చంపే సైకో కిల్లర్ కే చుక్కలు చూపించే నాలుగడుగుల హీరో

OTT Movie : వీడు మామూలోడు కాదు … అమ్మాయిల్ని టార్గెట్ చేసి చంపే సైకో కిల్లర్ కే చుక్కలు చూపించే నాలుగడుగుల హీరో

OTT Movie : ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మలయాళం, తమిళ్, హిందీ భాషలలో ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను  అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒక మరుగుజ్జు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. స్టోరీ ఎమోషన్ గా ఉండటమే కాకుండా, ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మతిమారన్’ (Mathimaran). 2022లో విడుదలైన ఈ తమిళ  క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మంత్ర వీరపాండియన్ దర్శకత్వం వహించగా, లెనిన్ బాబు దీనిని నిర్మించారు. ఇందులో వెంకట్ సెంగుట్టువన్, ఇవానా టైటిల్ పాత్రలు పోషించగా, ఆరాధ్యతో పాటు M. S. భాస్కర్ సహాయక పాత్రలో నటించారు. దీనికి కార్తీక్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ 29 డిసెంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది.   OTTలో విడుదలైన తర్వాత మిశ్రమ ప్రశంసలను అందుకుంది. ఒక వ్యక్తి తన శారీరక వైకల్యం కారణంగా వివక్షను ఎదుర్కొంటాడు. దాని నుండి ఉత్పన్నమయ్యే సామాజిక ఒత్తిళ్లను అతను ఎలా నావిగేట్ చేస్తాడో ఈ మూవీ చూపించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

నిడుమరన్ చిన్న లోపంతో చిన్నప్పటినుంచి మరుగుజ్జుగా ఉండిపోతాడు. ఇతని చెల్లెలు ఆ లోపం లేకుండా మంచిగా హైట్ పెరుగుతుంది. తల్లిదండ్రులు వీళ్ళను చాలా బాగా చూసుకుంటారు. అయితే అందరూ నిడుమరన్ ను హైట్ విషయంలో స్కూల్లో ఎగతాళి చేస్తూ ఉంటారు. వీటిని ఎదుర్కొంటూ చెల్లితో కలిసి స్కూల్ కి వెళ్తాడు నిడుమరన్. స్కూల్లో ప్రభ అనే విద్యార్థి నిడుమరానికి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు అతని చెల్లెలు లెక్చరర్ తో లేచిపోతుంది. ఈ అవమానాన్ని భరించలేక నిడుమరన్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఎమోషన్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా రోజుల తరువాత నిడుమరన్ ఒకసారి చెల్లెల్ని కలవడానికి వెళ్తాడు. ఆమెను కలవడానికి ప్రభ కూడా సాయం చేస్తుంది.

నిడుమరన్ తన చెల్లెలి ఇంటికి వచ్చాక ఇద్దరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అదే ఊరిలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను దారుణంగా చంపుతూ ఉంటాడు. నిడుమరన్ చెల్లెలు ఇంటి పక్కనే ఉన్న ఒక అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ప్రభ సాయం తీసుకుని, ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవాలనుకుంటాడు నిడుమరన్. ఇదివరకు మిస్ అయిన అమ్మాయిల వివరాలు తెలుసుకుంటాడు.  చివరికి నిడుమరన్ ఆ సైకో కిల్లర్ ని పట్టుకుంటాడా? సైకో కిల్లర్ ఎందుకు అమ్మాయిలను చంపుతూ ఉంటాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×