Time Loop Movie OTT : ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తాడు. వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. కానీ షాక్ ఏంటంటే… మరుసటి క్షణం మళ్లీ అదే రోజున, అదే పరిస్థితిలో కళ్లు తెరుస్తాడు. మళ్లీ యుద్ధానికి వెళ్తాడు… మళ్లీ చనిపోతాడు… మళ్లీ అదే రోజు మొదలవుతుంది. ఇలా చావు, బతుకు, చావు, బతుకు… ఎన్ సార్లు జరిగినా అతడికి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అయితే ఈ టైమ్ లూప్ అతడికి ఒక అవకాశం కూడా ఇస్తుంది. ప్రతిసారి చనిపోయిన తర్వాత గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మరింత ముందుకు వెళ్లొచ్చు. ఏలియన్స్ తో యుద్ధం గెలిచే వరకు ఆగని ఈ సైనికుడి కథే ‘Edge of Tomorrow’. మరి ఈ సై-ఫై థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
మేజర్ విలియం కేజ్ ఒక మిలిటరీ ఆఫీసర్. ఎందుకంటే అతడికి అసలు ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ కాదు. కానీ పరిస్థితుల కారణంగా అతడిని నేరుగా ఏలియన్స్ తో జరుగుతున్న భారీ యుద్ధంలోకి పంపిస్తారు. యుద్ధభూమిలో దిగిన కొద్ది నిమిషాల్లోనే కేజ్ చనిపోతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కేజ్ చనిపోయిన తర్వాత అతడు తిరిగి అదే రోజుకు వచ్చేస్తాడు. తాను యుద్ధానికి వెళ్లే ముందు ఉన్న పరిస్థితిలోనే మళ్లీ కళ్లు తెరుస్తాడు.
మొదట ఏం జరుగుతుందో అతడికి అర్థం కాదు. కానీ అదే రోజు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుండటంతో తనకు టైమ్ లూప్ లో చిక్కుకున్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కేజ్ కు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే… ప్రతిసారి చనిపోయినా గతంలో జరిగిన విషయాలు మాత్రం అతడికి గుర్తుంటాయి. అంటే మొదటిసారి యుద్ధంలో ఎక్కడ దాడి జరుగుతుందో తెలియక చనిపోయినా, రెండోసారి దాన్ని ముందే ఊహించగలడు. ఇలా ప్రతిసారి తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ యుద్ధంలో మరింత ముందుకు వెళ్తుంటాడు.
ఈ ప్రయాణంలో అతడికి రీటా వ్రాటాస్కీ పరిచయం అవుతుంది. ఏలియన్స్ పై పోరాటంలో ఆమె ఇప్పటికే ఒక లెజెండ్ లా మారి ఉంటుంది. కేజ్ టైమ్ లూప్ గురించి రీటాకు చెప్పడంతో ఇద్దరూ కలిసి అసలు ఏలియన్స్ బలహీనత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే కేజ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉంటుంది… ఆ రోజులోనే మొత్తం యుద్ధాన్ని మార్చాలి. ఎక్కడ శత్రువు దాడి చేస్తాడు ? ఎవరు చస్తారు ? ఏ మార్గంలో వెళ్లాలి ? అన్నీ అతడు ముందే తెలుసుకోగలడు. కానీ ఒక చిన్న తప్పు జరిగినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. ఇలా టైమ్ లూప్ కాన్సెప్ట్ కు మిలిటరీ యాక్షన్, ఏలియన్ వార్, టామ్ క్రూజ్ – ఎమిలీ బ్లంట్ కెమిస్ట్రీ వంటి అంశాలతో సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.
‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’ 2014లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. దీనికి Doug Liman దర్శకత్వం వహించారు. Tom Cruise మేజర్ విలియం కేజ్‌గా, Emily Blunt రీటా వ్రాటాస్కీగా, Brendan Gleeson జనరల్ బ్రిగమ్‌గా, Bill Paxton మాస్టర్ సార్జెంట్ ఫారెల్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. Prime Videoలో కూడా ఉంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.