E-Paper
Advertisement

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్
Advertisement

Hooded Eyes Eyeliner Tricks| మేకప్ వేసుకునేటప్పుడు కళ్లకు ఐలైనర్ పెట్టుకోవడం చాలామంది మహిళలకు ఇష్టం. అయితే కొందరికి ఐలైనర్ పెట్టుకున్నా ఆశించిన లుక్ కనిపించదు. ముఖ్యంగా హుడెడ్ ఐస్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కనురెప్పలపై ఉండే అదనపు చర్మం ఉంటే ఆ కళ్లకు హుడెడ్ ఐస్ అంటారు. ఈ అదనపు చర్మం కారణంగా ఐలైనర్ సరిగ్గా కనిపించదు. కొన్నిసార్లు ఎంత అందంగా ఐలైనర్ వేసుకున్నా కళ్లు చిన్నగా కనిపిస్తాయి. అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే మీ కళ్లను పెద్దగా, ఆకర్షణీయంగా చూపించవచ్చు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హుడెడ్ ఐస్ అంటే ఏమిటో తెలుసా?

కనురెప్పలపై అదనపు చర్మం ఉండి, అది కంటి సహజమైన క్రీజ్‌ను కొంతవరకు కప్పేస్తే వాటిని హుడెడ్ ఐస్ అంటారు. ఇలాంటి కళ్లలో క్రీజ్ స్పష్టంగా కనిపించదు. కళ్లు తెరిచినప్పుడు కనురెప్పలపై ఉన్న చర్మం ఐలైనర్‌ను కప్పేస్తుంది. అందువల్ల సాధారణంగా వేసుకునే వింగ్డ్ ఐలైనర్ కూడా సరిగ్గా కనిపించదు. ఇలాంటి వారు కంటి ఆకారానికి సరిపోయే పద్ధతులను ఎంచుకోవాలి.

1. హుడెడ్ ఐస్ ఉన్నవారు పలుచటి ఐలైనర్ పెట్టుకోవాలి

Advertisement

హుడెడ్ ఐస్ ఉన్నవారికి పలుచటి ఐలైనర్ మంచి ఎంపిక. మందంగా ఐలైనర్ వేస్తే కనురెప్పలపై ఖాళీ స్థలం తగ్గిపోతుంది. దీనివల్ల కళ్లు మరింత చిన్నగా కనిపిస్తాయి. ముందుగా అద్దంలోకి చూస్తూ కళ్లు తెరిచి ఉంచాలి. తర్వాత కంటి లోపలి మూల నుంచి బయటివైపు పలుచగా ఐలైనర్ వేయాలి. కనురెప్పల వెంట సమానంగా గీత గీయాలి. చివర్లో కొద్దిగా పైకి లేపినట్లు గీత వేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఐలైనర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

2. బ్యాట్ వింగ్ ఐలైనర్‌తో ప్రత్యేకమైన లుక్

సాధారణ వింగ్డ్ ఐలైనర్ హుడెడ్ ఐస్ ఉన్నవారికి సరిగ్గా కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాట్ వింగ్ ఐలైనర్ ప్రయత్నించండి. ముందుగా కళ్లు తెరిచి అద్దంలోకి నేరుగా చూడాలి. కంటి బయటి మూల నుంచి కొద్దిగా పైకి చిన్న గీత గీయాలి. తర్వాత కళ్లు మూసుకుని ఆ గీతను కనురెప్పల దగ్గర వేసిన ఐలైనర్‌తో కలపాలి. మధ్యలో ఖాళీగా ఉన్న భాగాన్ని ఐలైనర్‌తో నింపాలి. ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తే అందమైన బ్యాట్ వింగ్ ఆకారం కనిపిస్తుంది. మొదటిసారి ప్రయత్నించేవారు పెన్సిల్ ఐలైనర్ ఉపయోగిస్తే సులభంగా ఉంటుంది.

Advertisement

Also Read: కాజల్ వ్యాపించగానే మేకప్ మొత్తం చెడిపోతోందా? గంటలసేపు చెదరని కాటుక ఇంట్లో ఇలా చేసుకోండి

3. కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు టైట్ లైనింగ్

కళ్లకు ఎక్కువ మేకప్ లేకుండానే అందమైన లుక్ కావాలనుకునేవారు టైట్‌లైనింగ్ ప్రయత్నించండి. ఈ పద్ధతిలో పై కనురెప్పల వెంట్రుకల మధ్య ఖాళీలకు ఐలైనర్ వేస్తారు. దీనివల్ల కనురెప్పల వెంట్రుకలు మరింత ఒత్తుగా కనిపిస్తాయి. ముందుగా కళ్లకు సురక్షితమైన ఐలైనర్ పెన్సిల్ లేదా జెల్ లైనర్ తీసుకోవాలి. పై కనురెప్పల వెంట్రుకల మధ్య నెమ్మదిగా అప్లై చేయాలి. తర్వాత మస్కారా వేసుకుంటే వెంట్రుకలు మరింత ఒత్తుగా కనిపిస్తాయి. అయితే ఐలైనర్ కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

Also Read: పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

మీ కళ్లకు ఏ ఐలైనర్ పద్ధతి సరిపోతుంది?

పలుచటి ఐలైనర్ సహజమైన లుక్ ఇస్తుంది. బ్యాట్ వింగ్ ఐలైనర్ ప్రత్యేకమైన వింగ్డ్ లుక్ అందిస్తుంది. టైట్‌లైనింగ్ వల్ల వెంట్రుకలు ఒత్తుగా కనిపిస్తాయి. సరైన ప్రాక్టీస్‌తో హుడెడ్ ఐస్ ఉన్నవారు కూడా అందమైన ఐలైనర్ లుక్ పొందవచ్చు.

Related News

చలికాలంలో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? ఉదయాన్నే టీ తాగే ముందు ఈ స్పైసీ డ్రింక్ తాగండి చాలు

భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఏఐ.. విడాకుల వరకు వెళ్లిన గొడవ

నెయ్యి లేకుండా మైసూర్ పాక్! ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్‌

లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!

బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

అచ్చం 5 స్టార్ హోటల్ రుచి.. చాలా సింపుల్‌గా ముర్గ్ మలై కోఫ్తా!

ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!

Big Stories

Advertisement
×