E-Paper
Advertisement

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… మైండ్ బ్లోయింగ్ పవర్స్ తో రివేంజ్… ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ తెలుగులో

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… మైండ్ బ్లోయింగ్ పవర్స్ తో రివేంజ్… ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ తెలుగులో
Advertisement

Horror Series OTT : సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటే కామన్ అయిపోయింది. కానీ ఒక అమ్మాయిని అదే పనిగా టార్చర్ చేస్తూ పోతే… ఒకరోజు ఆమెకు ఉన్న పవర్స్ బయటపడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? చిన్నప్పటి నుంచి తల్లి కఠినమైన ఆంక్షల మధ్య పెరిగిన క్యారీకి స్కూల్‌లో కూడా కష్టాలు తప్పవు. తోటి స్టూడెంట్స్ ఆమెను టార్గెట్ చేస్తూ టార్చర్ పెడతారు. సోషల్ మీడియాలో కూడా ఆమెను వదలరు. అయితే క్యారీలో ఎవరికీ తెలియని ఓ శక్తి ఉంటుంది. తన ఆలోచనతో వస్తువులను కదిలించే టెలికైనెటిక్ పవర్స్ తో ఇన్నాళ్లు తనను ఏడిపించిన వాళ్ను ఎదుర్కొంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ సిరీస్ ‘Carrie’. స్టీఫెన్ కింగ్ రాసిన పాపులర్ నవల ఆధారంగా వచ్చిన ఈ కొత్త సిరీస్‌లో పాత కథకు ఇప్పటి జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా, సైబర్ బుల్లీయింగ్ అంశాలను జోడించారు. మరి క్యారీ జీవితంలో ఏం జరుగుతుంది? ఆమెకు ఆ పవర్స్ ఎలా వస్తాయి? ఆ తర్వాత పరిస్థితి ఎటు వెళ్తుంది? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

క్యారీ వైట్ చిన్నప్పటి నుంచి తల్లి మార్గరెట్ కఠినమైన నియమాల మధ్య పెరుగుతుంది. తండ్రి ఆకస్మిక మరణం తర్వాత ఆమె జీవితంలో మరో పెద్ద మార్పు వస్తుంది. కొత్తగా పబ్లిక్ హైస్కూల్‌ లో అడుగుపెట్టిన క్యారీకి అక్కడ కూడా ప్రశాంతత ఉండదు. తోటి విద్యార్థుల బుల్లీయింగ్, అవమానాలు ఒకవైపు ఉంటే… సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ మరోవైపు ఆమెను వెంటాడుతుంటాయి.

Advertisement

క్యారీ మాత్రం పెద్దగా ఎవరితోనూ కలవకుండా తన లోకంలో తాను ఉంటుంది. కానీ ఆమె జీవితంలో ఓ వింత మార్పు మొదలవుతుంది. తన ఆలోచనలతో వస్తువులను కదిలించగల టెలికైనెటిక్ శక్తి తనలో ఉందని ఆమెకు క్రమంగా అర్థమవుతుంది. మొదట ఈ పవర్ ‌ను చూసి ఆమెకే భయం వేస్తుంది. కానీ తనపై జరిగే వేధింపులు, కోపం పెరిగే కొద్దీ ఆ శక్తి కూడా బలపడుతుంది. ఇక్కడే కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది.

ఇన్నాళ్లు అందరి చేతిలో అవమానాలు ఎదుర్కొన్న క్యారీ… ఇప్పుడు తన చేతిలో ఉన్న పవర్‌ను ఎలా ఉపయోగించబోతోంది ? తనను టార్గెట్ చేసిన వాళ్లపై రివెంజ్ తీసుకుంటుందా? లేక ఈ శక్తే చివరికి ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ కొత్త వెర్షన్‌లో హారర్‌తో పాటు సోషల్ మీడియా వల్ల టీనేజర్లపై పడుతున్న మెంటల్ ప్రెజర్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ వంటి అంశాలను కూడా టచ్ చేశారు. అందుకే పాత ‘Carrie’ కథ తెలిసిన వాళ్లకూ ఇది కొంత కొత్తగా అనిపిస్తుంది.

Advertisement

Also Read : వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

ఎక్కడ చూడొచ్చు?

‘క్యారీ’ సిరీస్ Prime Videoలో అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్ల సిరీస్ ఇది. Summer H. Howell క్యారీగా, Samantha Sloyan మార్గరెట్‌గా నటించారు. ఈ సిరీస్‌కు Mike Flanagan షోరన్నర్, రచయిత, ప్రధాన దర్శకుడిగా వ్యవహరించారు. ఆయనతో పాటు Kate Siegel, Axelle Carolyn, Kyra Sedgwick, Hiromi Kamata ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. సిరీస్ ఇంగ్షీషు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా ఉంది. .

Related News

వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

దట్టమైన అడవిలో విమానం క్రాష్… బతకడానికి అమ్మాయిలు చేసిన పని చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ప్రతిరోజూ ఉదయం 3:33 గంటలకే మెలకువ… సీరియల్ కిల్లర్‌కి, ఈ టైమ్‌కి ఉన్న లింక్ ఏంటి ? తెలుగులోనే స్ట్రీమింగ్

బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా

Big Stories

Advertisement
×