E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Epic- first semister Movie OTT: ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) , వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఫీచర్ ఫిలిం డైరెక్టర్ గా ఆదిత్య హాసన్ కి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మాణం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఎపిక్ మూవీ..

ఈ సినిమా డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 2026 అక్టోబర్ 9న నెట్ ఫ్లిక్స్ లో ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది . ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన ఆడియన్స్ ఇప్పుడు తమకు నచ్చిన భాషలో ఇంటి నుంచే సినిమా చూసే అవకాశం లభించనుంది. మరి థియేటర్లలో అనుకున్నంత స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎపిక్ మూవీ స్టోరీ..

Advertisement

90స్ కథలో చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) పెరిగి పెద్దయ్యాక ఏ పని చేయకుండా దర్శకుడు అవ్వాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. ఎవరో ఇచ్చిన సలహా మేరకు మాస్టర్ శివాజీ ఆదిత్యని అప్పు చేసి మరీ లండన్ కు పై చదువుల కోసం పంపిస్తాడు. తండ్రి బలవంతంతో లండన్ వచ్చిన ఆదిత్య.. తిట్టుకుంటూనే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, చదువుతూ ఇంటికి డబ్బు పంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడికి అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. వీరిద్దరూ మొదట కులాలు వేరు కావడంతో ఎలాంటి రిలేషన్ లోకి వెళ్ళకూడదు అనుకుంటూనే.. ఒకరినొకరు విడిచి ఉండలేనంత దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆదిత్య, కడలి ఒకటయ్యారా? లేదా? వీరిద్దరూ కలిసి లండన్ లో ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ..

ALSO READ: బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

ఓటీటీ లోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందా?

Advertisement

సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చెప్పాడు ? అనే విషయం మీద కాస్త అవగాహన లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా అనిపించినా.. రెండవ భాగం మాత్రం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంద. క్లైమాక్స్ ఎందుకో అర్ధాంతరంగా ఏదో ముగించేయాలి కాబట్టి ముగించేసినట్లు అనిపిస్తుంది. ఇంకేదో ఉంటుంది అని ఆశలు పెట్టుకొని వెళ్లిన ప్రేక్షకులకు క్లైమాక్స్ లో నిరాశ చెందారు. అందుకే ప్రేక్షకులను థియేటర్లో ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటిటిలోనైనా మెప్పిస్తుందేమో చూడాలి.

Related News

పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్

Big Stories

Advertisement
×