E-Paper
Advertisement

అమ్మాయిలే ఈ దెయ్యం టార్గెట్… 15 ఏళ్లుగా హాస్టల్ ను పీడిస్తున్న శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ మూవీ

అమ్మాయిలే ఈ దెయ్యం టార్గెట్… 15 ఏళ్లుగా హాస్టల్ ను పీడిస్తున్న శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ మూవీ
Advertisement

OTT Movie: సలార్, కేజీఎఫ్ వంటి భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తొలి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘418’ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైత్ర జె. ఆచార్, సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, రమేష్ ఇందిర కీలక పాత్రలు పోషించారు. 2026 అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తన భయానక సన్నివేశాలతో సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికెట్ పొంది, ఇప్పుడు డిజిటల్ తెరపై వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కథ ఏమిటంటే ?

ఈ సినిమా కథంతా ఒక మారుమూల ప్రాంతంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ నేపథ్యంలో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 418 గత 15 ఏళ్లుగా మూసివేసి (సీల్ చేసి) ఉంటుంది. ఆ గదిలో గతంలో జరిగిన కొన్ని దారుణ హత్యలు, అంతుచిక్కని మిస్టరీ కారణంగా ఆ హాస్టల్‌లోకి అమ్మాయిలకు ప్రవేశం లేదనే కఠిన నిబంధన కూడా ఉంటుంది. అయితే 15 ఏళ్ల తర్వాత ఆ హాస్టల్‌ను తిరిగి తెరవడంతో అసలు కథ మొదలవుతుంది.

Advertisement

18 ఏళ్ల మెడికల్ విద్యార్థి వివేక్ (సూర్య రాజ్)కు సరిగ్గా ఆ శాపగ్రస్తమైన రూమ్ నంబర్ 418 పక్కనే ఉన్న 417వ గదిని కేటాయిస్తారు. ఆ గదిలోకి అడుగుపెట్టినప్పటి నుంచే వివేక్‌కు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ గదిలో ఉన్న దుష్టశక్తి ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తుందనే భయంకరమైన నిజం బయటపడుతుంది. దేవిక (చైత్ర జె. ఆచార్) రాకతో ఆ మిస్టరీ మరింత ముదురుతుంది. అసలు 15 ఏళ్ల క్రితం రూమ్ నంబర్ 418లో ఏం జరిగింది? ఆ దెయ్యం అమ్మాయిలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది? విజ్ఞానానికి, మూఢనమ్మకాలకు మధ్య జరిగే ఈ పోరాటంలో ఆ విద్యార్థులు బయటపడ్డారా లేదా? అనేదే ఈ సినిమా కథ. రాత్రిళ్ళు మాత్రం ఈ మూవీని ఒంటరిగా చూడొద్దు. ఒకవేళ చూశారో అంతే సంగతులు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ హారర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ రోజు నుంచే ఓటీటీ ఆడియన్స్ ను భయపెడుతోంది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాల తర్వాత, 2026 నవంబర్ 20 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. విశేషమేమిటంటే, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో హారర్ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.

Advertisement

Read Also: పిల్లలను జాంబీలుగా మార్చే ఐస్ క్రీమ్… ఓటీటీని అల్లాడిస్తున్న మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ థ్రిల్లర్! డోంట్ మిస్

Tags

Related News

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ… నేటి యువతకు కనువిప్పు కలిగించే ఎమోషనల్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రూ.11 కోట్ల లాటరీ అనుకుంటే ఫ్రిజ్ మాత్రమే వచ్చింది.. అత్తారింట్లో పరువు కోసం అల్లుడి తిప్పలు చూస్తే నవ్వులే

తాగుబోతు అల్లుడు తెచ్చిన తంటాలు… ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్న కామెడీ డ్రామా

పిల్లలను జాంబీలుగా మార్చే ఐస్ క్రీమ్… ఓటీటీని అల్లాడిస్తున్న మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ థ్రిల్లర్! డోంట్ మిస్

అతిగా ఆలోచించడంలో ఆస్కార్ గెలుచుకునే కుర్రాడు… కడుపుబ్బా నవ్వించే సైక్ కామెడీ… నేడు ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్

నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్

Friday OTT Releases : ఓటీటీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఏకంగా 10 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×