E-Paper
Advertisement

మా ప్రాంత చెరువులనూ కాపాడండి సార్! హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు

మా ప్రాంత చెరువులనూ కాపాడండి సార్!  హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు
Advertisement

HYDRAA Prajavani: స్వేచ్ఛ బ్యూరో: చెరువులు క‌బ్జా కాకుండా కాపాడ‌డ‌మే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న తీరు ఎంతో ఆదర్శంగా ఉందని, హైడ్రా అభివృద్ధి చేయక ముందు, చేసిన తర్వాత చెరువులను పరిశీలిస్తే ఎంతో మార్పు క‌న‌ప‌డుతోందని నగరవాసులు వ్యాఖ్యానించారు. చెరువుల చెంత‌ దుర్గంధం పోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్ప‌డిందని, కొన్ని చెరువులకే హైడ్రా పరిమితం కాకుండా సార్.. మా ప్రాంతంలోని చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు కోరారు.

హైడ్రా ప్రజావాణికి వినతి పత్రం..

Advertisement

చెరువుల అభివృద్ధి అంటే సుంద‌రీక‌రించేయ‌డం కాకుండా, చెరువులో 10 అడుగుల‌కు పైగా పూడిక‌ను తొల‌గించి, మొత్తం దుర్గాంధాన్ని తొలగించి, న‌గ‌రంలో అన్ని చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై జనవాణి సంస్థ హైడ్రాను సోమవారం కోరింది. చెరువుల వివ‌రాల‌తో ఈ మేర‌కు వినతిపత్రం కూడా స‌మ‌ర్పించింది. అభివృద్ధి చేసిన చెరువ‌ల్లోకి మురుగు నీరు చేర‌కుండా వ‌ర్షాకాలంలో వ‌ర‌ద నీరు, మిగ‌తా సమయంలో ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని పంపాల‌ని కోరింది. గండిపేట చెరువుతో పాటు హిమాయ‌త్‌సాగ‌ర్ కూడా క‌లుషిత‌మవుతుందని, జంట జ‌లాశయాల‌ను కాపాడాల‌ని కోరారు. ఈ మేర‌కు విన‌తి పత్రాలు అంద‌జేశారు. సోమవారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 61 ఫిర్యాదులు రాగా, హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించారు. వెంటనే పరిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

ఫిర్యాదులిలా..

Advertisement

మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్ గిరి జిల్లా ఉప్ప‌ల్ మండ‌లంలోని నాగోలు చెరువు 14 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. అయితే చెరువులోకి మురుగు నీరు చేర‌డంతో దుర్గంధంగా మారింది. చెరువు ప‌రిస‌రాల్లో నివాసం ఉండ‌లేక‌పోతున్నామని, నాగోలు చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేయాల‌ని శ్రీ‌నివాస ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌జావాణిలో కోరింది. చెరువు ప‌రిస‌రాల్లోని భూగ‌ర్భ జ‌లాలు కూడా క‌లుషిత‌మై, ప్రాణాంత‌క రోగాల భారిన ప‌డుతున్నామ‌ని వాపోయారు. కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారం విలేజ్‌లోని స‌ర్వే నెంబ‌ర్లు 42, 43లో ఉన్న చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ ప‌రిధిలో అపార్టుమెంట్లు క‌ట్టేస్తున్నారు. వాటిని అడ్టుకుని చెరువును కాపాడాల‌ని ప్ర‌జావాణిలో స్థానికులు కోరారు. రావిర్యాల పెద్ద చెరువులో ఆక్ర‌మ‌ణ‌లు స్ప‌ష్టంగా ఉన్నాయని, మ‌ట్టి పోసి నింపేశారని స్థానికులు ఆరోపించారు.

చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి ఎంత‌?

అక్క‌డ లే ఔట్ల‌కు అనుమ‌తులు కూడా తెచ్చుకున్నారని, ఇప్పుడు లే ఔట్‌లు మునిగిపోతున్నాయ‌ని వాపోయారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి ఎంత‌? బ‌ఫ‌ర్ జోన్ హ‌ద్దుల‌ను నిర్ధారించి చెరువును కాపాడాల‌ని అక్క‌డి స్థానికులు హైడ్రాను కోరారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే మంచి ప‌ర్యాట‌క ప్రాంతం కావటంతో పాటు మ‌త్స్య‌కారుల‌కు కూడా ఉప‌యోగంగా ఉంటుంద‌ని అక్క‌డి స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో విజ్ఞ‌ప్తి చేశారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం, సాయిబాబాన‌గ‌ర్‌, కృషికాల‌నీలో ర‌హ‌దారిని ఆక్ర‌మించి, అక్క‌డ ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొల‌గించి భ‌వ‌నాన్ని నిర్మించేశార‌ని ఆ కాల‌నీ సంక్షేమ సంఘం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసింది. ఈ అక్ర‌మ క‌ట్ట‌డంపై తాము కోర్టుకు వెళ్లామ‌ని, ఆ భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను హైకోర్టు ర‌ద్దు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ర‌హ‌దారిపై ఆటంకాల్లేకుండా చూడండి..

తిరిగి ఇప్పుడు అదే స్థ‌లంలో మ‌ళ్లీ భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని చూస్తున్నార‌ని, వెంట‌నే ఆ నిర్మాణాల‌ను అడ్డుకుని ర‌హ‌దారిపై ఆటంకాల్లేకుండా చూడాల‌ని ప్ర‌జావాణిలో కోరారు. సికింద్రాబాద్‌, మ‌చ్చ‌బొల్లారం జొన్న‌బండ స‌ర్వే నెంబ‌రు 33, 34లోని శ్రీ గ‌ణేష్ ఎన్‌క్లేవ్‌లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 1800 గ‌జాల స్థలాన్ని క‌బ్జా చేయాల‌ని, ల్యాండ్ ఓన‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కాల‌నీ వాసులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసిన‌ప్పుడు స్ప‌ష్టంగా కేటాయించార‌ని, లే ఔట్ ప్ర‌కారం ఆ 1800 గ‌జాల స్థ‌లాన్ని కాపాడాల‌ని హైడ్రాను కోరారు. బాగ్ అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌ను అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి వ‌ర‌ద ముప్పు త‌ప్పించిన హైడ్రా, తాజాగా ఆ ప్రాంతంలో పైపులైన్ల ప‌నులు కూడా చేప‌ట్టి, వ‌ర‌ద నీరు నేరుగా చెరువులోకి చేరిన త‌ర్వాత‌, మూసీ నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేయ‌డాన్ని అక్క‌డి గాయ‌త్రి ట‌వ‌ర్స్ నివాసితులు అభినందించారు.

ఆక్రమించకుండా చూడండి సార్..

ప‌నులు త్వ‌రగా పూర్తి చేసి అంబ‌ర్‌పేట ప‌రిస‌రాల్లో శాశ్వ‌తంగా వ‌ర‌ద ముప్పు లేకుండా చూడాల‌ని కోరారు. మేడ్చ‌ల్-మ‌ల్కాజ్ గిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లిలోని ద‌యార‌గూడ‌లో హుడా లే ఔట్ లో 800 గ‌జాల స్థలాన్ని కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి స్థానికులు ఫిర్యాదు చేశారు. హుడా ఖాళీగా వ‌దిలేసిన 800 గ‌జాల స్థలాన్ని ప్ర‌జావ‌స‌రాల‌కు వినియోగించాల‌ని కోరారు. ప‌క్క‌నే ఉన్న ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు 200 గ‌జాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఆ స్థ‌లాన్ని కేటాయించాల‌ని, ఏ ఒక్క‌రూ ఆక్ర‌మించ‌కుండా చూడాల‌ని హైడ్రాను కోరారు. ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్ తదితరులు.

Also Read: మంత్రులపై పగ.. అభ్యర్థులపై దెబ్బ! కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో ఊహించని ట్విస్ట్

Tags

Related News

అర్హులకు నై.. అనర్హులకు సై! జేఎల్స్ క్రమబద్ధీకరణలో తీవ్ర అక్రమాలు?

మంత్రులపై పగ.. అభ్యర్థులపై దెబ్బ! కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో ఊహించని ట్విస్ట్

సామీ.. జీతాలు చెల్లించండి! GHMC అధికారులను నిలదీసిన బీఎంఎస్ నేతలు

నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే?

మహిళా టెక్కీ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘటన

తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!

ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్.. కేవలం 3 నెలల్లో రికార్డును బ్రేక్ చేసిన టీజీఎస్ఆర్టీసీ!

Big Stories

Advertisement
×