OTT Movie: కోలీవుడ్ యంగ్ హీరో ఏగన్ (Aegan), కోర్ట్ ఫేమ్ శ్రీదేవి అపల్ల (Sridevi Apalla), ఫెమినా జార్జ్ (Femina George) ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘హైకూ’ (Haiku) ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌గా ఈరోజు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జెన్సన్ దివాకర్, అధిర్చి అరుణ్, మైమ్ గోపి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2026 అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సున్నితమైన అంశాలతో యువతను విశేషంగా ఆకట్టుకుంది. వందల మంది అమ్మాయిలు చదివే కాలేజ్ లో ఒక్కడే అబ్బాయి ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఓ మంచి ఫీల్ ఇస్తూ ఇది చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వీకెండ్ లో ‘హైకూ’ ని చూస్తూ పాప్ కార్న్ తో ఆ రొమాంటిక్ ఫీల్ ను ఎంజాయ్ చేయండి.
మనోహర్ అలియాస్ మనో (ఏగన్) మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. గతంలో పవలకోడి అలియాస్ కొడి (కోర్టు ఫేమ్ శ్రీదేవి అపల్ల)తో తనకున్న మొదటి ప్రేమ విఫలమవడంతో మనో తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. తనలోని పొసెసివ్‌నెస్, చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల కొడి అతనికి దూరమై వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ బాధలో ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల వందల మంది అమ్మాయిలు చదువుకునే ఒక కాలేజీలో ఏకైక అబ్బాయిగా మనో అడుగుపెట్టాల్సి వస్తుంది. తన కంఫర్ట్ జోన్‌కు పూర్తిగా భిన్నమైన ఆ కొత్త ప్రపంచంలో అమ్మాయిల ర్యాగింగ్, సరదా సవాళ్ల మధ్య మనో జీవితం ఆసక్తికరంగా సాగుతుంది.
కాలేజీ తర్వాత ఎన్నో ప్రయత్నాల అనంతరం ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించిన మనోకు, అక్కడ అప్రెంటీస్‌గా చేరిన నివేద (ఫెమినా జార్జ్)తో పరిచయం ఏర్పడుతుంది. తనలాగే గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలతో బాధపడుతున్న నివేదకు, తన మనసులోని భావాలను కవిత్వం (హైకూ) రూపంలో వ్యక్తపరిచే మనో ఎలా దగ్గరయ్యాడు? ఇద్దరూ ప్రేమలో పడి అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో, పాత కథ మాదిరిగానే వీరి బంధం కూడా బ్రేకప్ అంచుకు ఎందుకు వచ్చింది? కొడితో విడిపోవడానికి, నివేదతో దూరమవ్వడానికి ఉన్న ఆ ఒకే ఒక్క కారణం ఏంటి? చివరకు మనో, నివేద ఒక్కటయ్యారా లేదా? అనేదే ఈ సినిమా అసలు కథ.
హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమకథ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాల తర్వాత, నవంబర్ 20 నుంచి ‘హైకూ’ (Haiku) సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో, ఈ వీకెండ్లో ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియన్స్ చూడదగ్గ ఒక మంచి ఫీల్-గుడ్ ఎంటర్టైనర్గా ‘హైకూ’ నిలుస్తోంది.
Read Also: అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ