OTT Movie : ఈమధ్య స్క్విడ్ గేమ్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ మొదటినుంచి చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. అలాంటి గుండెల్లో దడ పుట్టించే భయంకరమైన గేమ్ తో ఒక మూవీని తెరకెక్కించారు. ఇందులో చాలా ప్రమాదకరమైన గేమ్ లు ఉంటాయి. వీటిని ఎదుర్కునే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ గేమ్ ఆడటానికి వచ్చిన వాళ్ళు, ప్రాణాలతో బయటకు వెళతారా అనే సందేహం కలుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎస్కేప్ రూమ్: టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్’ (Escape Room: Tournament of Champions). 2021 లో వచ్చిన ఈ మూవీకి ఆడమ్ రాబిటెల్ దర్శకత్వం వహించారు. ఇది 2019 లో రిలీజ్ అయిన ‘ఎస్కేప్ రూమ్’ (Escape Room) కి సీక్వెల్ గా వచ్చింది. ఇందులో టేలర్ రస్సెల్, లోగాన్ మిల్లర్, డెబోరా ఆన్ వోల్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా మొదటి పార్ట్ లో ఉన్న సర్వైవర్లు జోయ్ డేవిస్, బెన్ మిల్లర్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు మినోస్ అనే మిస్టీరియస్ సంస్థ నిర్వహించిన డెత్ ట్రాప్ ఎస్కేప్ రూమ్ అనే గేమ్ నుండి తప్పిచ్చుకుంటారు. అందులో చాలా ఘోరమైన ఫజిల్స్ పెడుతుంటారు. వీటిని ఎలాగైనా ఆపాలని నిశ్చయించుకుంటారు. జోయ్, బెన్ మినోస్ ప్రధాన కార్యాలయాన్ని కనిపెట్టడానికి న్యూయార్క్ సిటీకి బయలుదేరుతారు. అయితే వారు ఊహించని విధంగా మరోసారి మినోస్ రూపొందించిన కొత్త ఎస్కేప్ రూమ్ గేమ్‌లో చిక్కుకుంటారు. ఈ సారి వాళ్ళతో పాటు ఇతర సర్వైవర్లు కూడా ఉంటారు. వీరంతా గతంలో మినోస్ గేమ్‌ల నుండి బయటపడిన వారే కావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కొత్త గేమ్‌లో పాల్గొనేవారు ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’లో భాగంగా ఒకరితో ఒకరు పోటీపడతారు. ఈ గేమ్‌లో రూమ్‌లు చాలా ప్రమాదకరంగా, సవాలుగా రూపొందించి ఉంటారు. ఇందులో లేజర్ గ్రిడ్‌లతో కూడిన ఒక రూమ్ ఉంటుంది. ఇందులో తప్పు అడుగు వేస్తే ప్రాణాలు పోతాయి. మరో లెవెల్లోసాండ్ తో నిండిన రూమ్ ఉంటుంది. ఇది ఆటగాళ్లను క్రమంగా ముంచెత్తుతుంది. మరొక రూమ్ లో ఆసిడ్ వర్షంతో కూడి ఉంటుంది. ఇక్కడ తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
ఇలా ఒక్కొక్క రూమ్ చాలా డేంజర్ గా క్రియేట్ చేస్తారు. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ, జోయ్, బెన్‌లకు మినోస్ ఉద్దేశాలు, గతంతో వాళ్ళకు ఉన్న సంబంధం గురించి మరింత తెలుస్తుంది. అలాగే, ఈ గేమ్‌లో పాల్గొనే ఇతర సర్వైవర్లలో ఒకరైన అమండా తొలి పార్ట్ లో చనిపోయినట్లు చూపించినప్పటికీ, ఆమె బతికే ఉండటం ఒక పెద్ద ట్విస్ట్‌గా వస్తుంది. ఆమె మినోస్‌కు బలవంతంగా పనిచేస్తోందని తెలుస్తుంది. చివర్లో జోయ్, బెన్ మరోసారి తమ తెలివితేటలను ఉపయోగించి బయటపడతారు. కానీ మినోస్‌ను పూర్తిగా ఆపలేకపోతారు. జోయ్ మినోస్‌ను ఎదిరించేందుకు పోరాడుతూనే ఉంటుంది. అయితే ఆమె చివరకు ఒక విమానంలో చిక్కుకుని మరో గేమ్‌లోకి లాగబడుతుంది. చివరికి ఈ భయంకరమైన గేమ్ ని వీళ్ళు ఆపగలుగుతారా ? వాటిలోనే చిక్కుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే.