Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో పలు మార్పులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ ఇప్పుడు గతంలో కంటే వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా కొనసాగనుంది. ఈ విధానంలో AI సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇది నకిలీ బుకింగ్‌లను అరికట్టడంతో పాటు వెబ్ సైట్ క్రాషింగ్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్ టికెట్లపై ఆధారపడే ప్రయాణీకులకు ఈ కొత్త విధానం మరింత ప్రయోజనాన్ని కలిగించనుంది. ఇప్పుడు ఏసీ, నాన్ ఏసీ క్లాసులకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియ మరింత సులభతరం చేయబడింది. అంతేకాదు, టికెట్ అవైలబులిటీ పెంచడానికి ప్రతి ప్రయాణీకుడికి టికెట్ పరిమితిని కూడా నిర్ణయించారు.
కొత్త తత్కాల్ బుకింగ్ వ్యవస్థ గురించి..
తాజాగా తీసుకొచ్చిన తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థపేరు AI పవర్డ్ ఫాస్ట్ బుకింగ్ సిస్టమ్. AC క్లాస్ బుకింగ్ ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. నాన్ ఏసీ క్లాస్ బుకింగ్ సమయం ఉదయం 11:00 నుంచి మొదలవుతుంది. ప్రయాణీకుడికి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉండాలి. చెల్లింపు విధానాలు UPI, క్రెడిట్, బిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. రైలు రద్దు లేదంటే మూడు గంటల కంటే ఆలస్యం అయితే మాత్రమే రీఫండ్ పాలసీ వర్తిస్తుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుకింగ్ ను మరింత ఈజీగా మార్చేందుకు భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది.
1.బుకింగ్ టైమింగ్స్ మార్పు
ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్ బుకింగ్ ఇప్పుడు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం 11:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
2.ఆన్ లైన్ బుకింగ్ కు ప్రాధాన్యత
IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
3.గుర్తింపు రుజువు తప్పనిసరి
తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదో ఒక ఫ్రూప్ చూపించాల్సి ఉంటుంది.
4.ఒక్కో ప్రయాణీకుడికి టికెట్ పరిమితి
ఇప్పుడు ఒక ప్రయాణీకుడు గరిష్టంగా 4 తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
తత్కాల్ టికెట్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలి?
తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
⦿ ముందుగా IRCTC అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ఓపెన్ చేయండి.
⦿ యూజర్ పేరు, పాస్ వర్డ్ తో మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి
⦿ ప్రయాణ వివరాలను ఎంటర్ చేయండి. ‘ప్లాన్ మై జర్నీ’ విభాగానికి వెళ్లండి.
⦿ బయలుదేరే స్టేషన్, దిగాల్సిన స్టేషన్, ప్రయాణ తేదీని ఎంటర్ చేయండి.
⦿ తక్షణ ఎంపికను ఎంచుకోండి. బుక్ టికెట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
⦿ ‘తత్కాల్’ కోటాను ఎంచుకోండి. రైలు, క్లాస్ ను ఎంచుకోండి. అందుబాటులో ఉన్న రైళ్ల జాబితా నుంచి మీకు నచ్చిన రైలును ఎంచుకోండి. AC లేదంటే నాన్ AC క్లాస్ ను సెలెక్ట్ చేసుకోండి.
⦿ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయండి. గుర్తింపు కార్డు వివరాలను ఎంటర్ చేయండి.
⦿ పేమెంట్ చేసిన తర్వాత PNR నెంబర్ ను ఎంటర్ చేసుకోండి.
⦿ బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
AI టెక్నాలజీతో ప్రయోజనాలు
IRCTC ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో అనుసంధానం చేసింది. దీని ద్వారా పలు లాభాలు కలగనున్నాయి.
మోసాల తగ్గింపు: మోసపూరిత బుకింగ్‌లను గుర్తించి అరికట్టడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
మెరుగైన పనితీరు: ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలోనూ సైట్ డౌన్ కాకుండా జాగ్రత్త పడుతుంది.
రియల్ టైమ్ అప్ డేట్స్: ప్రయాణీకులకు సీట్ల లభ్యతపై వెంటనే సమాచారం లభిస్తుంది.
ఆటోమేటెడ్ సిస్టమ్: ఇక మాన్యువల్ ఎర్రర్ లకు తక్కువ ఛాన్స్ ఉంటుంది.
Read Also: ఇండియా నుంచి ఆ దేశానికి రైల్వే లైన్.. అదీ అండర్ వాటర్‌లో, ప్లాన్ అదిరింది!