Nindu Noorella Saavasam Serial Today Episode : మీనన్ చంపుతానని బెదిరించడంతో మిస్సమ్మ భయంతో తనకు చివరిసారిగా అమర్ తో మాట్లాడాలని ఉందని చెప్తుంది. దీంతో మీనన్ వాకీటాకీ ఇస్తాడు. అమర్‌తో మాట్లాడినట్టుగానే లోపలికి వచ్చే రూట్ చెప్తుంది మిస్సమ్మ. ఇంతలో అంజు కూడా విండో దగ్గరకు వచ్చి అమర్‌ను పిలుస్తుంది. అమర్, ఎస్సై శివ అందరూ పరుగెత్తుకొచ్చి అంజు చెప్పినట్టు లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి వెళ్లిన అమర్, మీనన్‌ను పట్టుకుని కొడతాడు. దీంతో మీనన్ తన మనుషులతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అంతా చూసిన ఆరు ఇంటికి వచ్చిన తర్వాత ఆడిటోరియంలో జరిగిన విషయాలు గుప్తకు చెప్తుంది. అప్పటికే చాలా రాత్రి అవుతుంది.
దీంతో ఆరు మా ఆయనేంటి ఇంకా రాలేదు అని అంటుంది. దీంతో గుప్త ఆ దాడికి పాల్పడిన వారిని, వారికి సాయం చేసిన వారిని పట్టుకోవాలి కదా అదే పనిలో ఉన్నాడు అని గుప్త చెప్తాడు. అవును ఆ పని ఉంది కదా ఆ రౌడీలను లోపలికి తీసుకొచ్చిన వారు ఎవరో తెలియాలి వారిని అసలు వదిలిపెట్టరు గుప్త గారు అంటుంది ఆరు. దీంతో గుప్త శుభవార్తతోనే వస్తాడులే అంటాడు. దీంతో ఆరు ఆశ్చర్యంగా అంటే వారికి సాయం చేసింది ఎవరో ఆయనకు తెలుసా..? గుప్తగారు అని అడగ్గానే.. తెలుసు అంటాడు గుప్త.అయితే మీకు కూడా తెలుసా..? గుప్త గారు అని ఆరు అడుగుతుంది. తెలుసు అని చెప్తాడు గుప్త. ఎవరు గుప్త గారు ఫ్లీజ్ చెప్పు గుప్త గారు అని అడుగుతుంది. దీంతో గుప్త ఇంకెవరు నీ స్నేహితురాలు మనోహరి అని చెప్తాడు. దీంతో ఆరు షాక్ అవుతుంది. నిజంగా అంటే మనోహరి గురించి నిజం తెలియబోతుందా..? అని అడగ్గానే..
అవును మన నీడలోనే ఉండి దుర్మార్గులు ఎన్ని చేసినను మనకు కనిపించవు అని మా పితృదేవులు చెప్పుచుండెడివారు. అలాగే నీ స్నేహితురాలు ఎన్ని చేసినను నీ పతి దేవుడికి ఏమీ కనిపించలేదు. మొదటిసారి ఆ బాలిక అడుగు బయట పెట్టినది. నీ పతి దేవుడికి చిక్కుటకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పుడు కదా అసలైన కథ మొదలైంది. ఇప్పుడు కదా నీ పతి దేవుని కంట ఆ బాలిక పడినది. ఇక మీదట మనోహరి దాచిన ఒక్కోక్క నిజం కాపాడిన ఒక్కోక్క అబద్దం బయట పడును అని గుప్త చెప్పగానే.. ఆరు హ్యపీగా హమ్మయ్యా మీరు చెప్తుంది నిజమా గుప్తగారు. ఆయనకు మనోహరి మీద అనుమానం కలగబోతుందా..? ఈరోజు కోసమే కదా నేను ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసింది. అంటూ ఫీలవుతుంటే ఇంతలో లోపలి నుంచి మిస్సమ్మ వచ్చి ఆరును గుప్తతో మాట్లాడటం చూసి అక్కడ ఎవ్వరూ లేరు అక్క ఎవరితో మాట్లాడుతుంది. అని అనుమానంగా చూస్తుంది.గుప్త మాత్రం బాలిక నీ సోదరి వస్తుంది. ఇక నేను వెళ్తాను.. అంటూ వెళ్లిపోతాడు.
దగ్గరకు వచ్చిన మిస్సమ్మ అక్కా మీరు ఇందాకటి నుంచి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో ఆరు అది నేను అప్పుడప్ఉనడు చందమామతో మాట్లాడుతుంటాను. అని చెప్తుంది. మిస్సమ్మ చందమామ ఎక్కడుంది అని అడుగుతంది. దీంతో ఆరు మాటర్ డైవర్ట్ చేస్తూ.. ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది అని ఆరు అడగ్గానే.. నిజం చెప్పండి మీరు ఇందాక మాట్ఈడింది మా అరు అక్కతోనేనా..? అంటూ అడగ్గానే ఎందుకు అలా అడిగావు అని ఆరు అడుగుతుంది. మా ఆరు అక్కా ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారు. మీరేమో గాలిలో చూస్తూ మాట్లాడుతున్నారు. పైగా జరగబోయేది తెలిసినట్టు చెప్తున్నారు. అనగానే ఆరు కంగారుగా నేను ఆత్మతో మాట్లాడుతున్నానంటేనే ఇంత భయపడుతుంది. నేను నిజంగా ఆత్మనే అని తెలిస్తే ఎలా అయిపోతుందో అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ లోపలికి వెళ్దాం పద అంటుంది. ఇద్దరూ కలిసి లోపలకి వెళ్తారు.
తర్వాత ఇంటకి వచ్చిన అమర్ రాథోడ్‌కు ఫోన్ చేసి మనోహరి ఫంక్షన్‌కు వచ్చిన పుటేజీ ఓపెన్ చేసి మనం చూసిన చేతికి మనోహరి చేతిని మ్యాచ్ చేసి చూడండి. అని చెప్తాడు. చూసిన రాథోడ్ మ్యాచ్ అయింది సార్ అని చెప్తాడు. దీంతో అమర్ కోపంగా గన్ తీసుకుని మనోహరి రూంలోకి వెళ్తాడు. ఎందుకు చేశావు మనోహరి అంటూ నీకు మీనన్‌కు ఉన్న సంబంధం ఏంటి..? అటాక్ కు ముందు మీనన్ నీకెందుకు కాల్ చేశాడు. ఆక్కడున్న ఆఫీసర్‌ను కొట్టి మీనన్ ఎందుకు లోపలికి తీసుకొచ్చావు అంటూ గన్ ఎయిమ్ చేస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?