OTT Movie : ఓటిటిలో అన్ని రకాల భాషల్లో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఏ భాషలో సినిమా వచ్చినా కంటెంట్ బాగుంటే మాత్రం వచ్చిన సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన ఒక కన్నడ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ నెల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివ రాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మించింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
వివేకానంద అమెరికాలో జాబ్ చేస్తుంటాడు. నాలుగు సంవత్సరాల తర్వాత వివేకానంద అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వస్తాడు. తన కజిన్ వివాహానికి హాజరు కావడానికి మైసూరు చేరుకుంటాడు. అయితే అతని రాకముందే ఒక విషాదం జరుగుతుంది. అతని తల్లిదండ్రులు మూర్తి, పద్మ ఒక ప్రమాదంలో మరణిస్తారు. ఈ ఘటన తర్వాత విక్కీ మూడు నెలల పాటు కోమాలోకి వెళ్తాడు. కోమా నుండి కోలుకున్న తర్వాత, అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. అంతే కాకుండా డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు ఇతనికి వస్తాయి. ఇక వివేకానంద తన డిప్రెషన్ నుంచి బయట పడటానికి వివిధ రకాల పద్ధతులను పాటిస్తాడు.
అతిగా ఆహారం తీసుకోవడం, సంగీతం, సంతోషం వంటి వాటి కోసం వెతకడం చేస్తాడు. ఈ క్రమంలో ఒక కొత్త తోడు కోసం ప్రయత్నిస్తాడు. ఇందుకుగానూ ఒక డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. వివేకానందకి డేటింగ్ యాప్ లో నేహా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ఇతని జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి వివేకానంద ఎటువంటి జీవితం గడుపుతాడు ? నేహాతో విక్కీకి ఎలాంటి రిలేషన్ ఏర్పడుతుంది ? తన గాయాలను మరచిపోతాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కన్నడ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కన్నడ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఫైర్ ఫ్లై’ (Firefly). 2025 లో వచ్చిన ఈ సినిమాకు వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో కూడా నటించాడు. ఇందులో అచ్యుత్ కుమార్, సుధారాణి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.