BigTV English

OTT Movie : స్కూల్ కి పోకుండా మంత్రాల గదికి వెళ్ళాడు… టీచర్ కి చుక్కలు చూపించాడు

OTT Movie : స్కూల్ కి పోకుండా మంత్రాల గదికి వెళ్ళాడు… టీచర్ కి చుక్కలు చూపించాడు

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. టీచర్ స్టూడెంట్ ల కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫాంటసీ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలతో కలసి ఈ మూవీని చూస్తే చాలా బాగుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘హెల్ప్ ఐ శ్రన్క్ మై టీచర్’ (Help I Shrunk my teacher). ఫెలిక్స్ అనుకోకుండా పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఒక మంత్రంతో మారుగుజ్జును చేస్తాడు. ఆ తరువాత పరిస్థితిని చక్కదిద్దడానికి, తన స్నేహితురాలు ఎల్లా సహాయం తీసుకుంటాడు ఫెలిక్స్. ఈ క్రమంలో వాళ్ళు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఫెలిక్స్ తన తండ్రితో కలిసి స్కూల్ కి వెళుతూ ఉంటాడు. తల్లి వేరొక సిటీలో జాబ్ చేస్తూ ఉంటుంది. తండ్రికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫెలిక్స్ ను కొత్త స్కూల్లో జాయిన్ చేస్తారు. మొదటి రోజు కావడంతో స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ ని కలుస్తారు. అయితే వీళ్ళు కాస్త లేటుగా రావడంతో, ప్రిన్సిపల్ కొన్ని కండిషన్లు పెడుతుంది. ఒక వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉంటాడని, ఆ తర్వాత కొన్ని టెస్టులు పాస్ అయితే స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తుంది. అయితే ఫెలిక్స్ కి రూల్స్ చెప్పి కంగారు పెట్టిస్తుంది ప్రిన్సిపల్. ఆ తర్వాత ఫెలిక్స్ క్లాస్ రూమ్ కి వెళ్ళాక, పిల్లలు కాస్త సరదాగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటాడు. ఆ స్కూల్లో ఒక గది ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది. అక్కడికి ఎవరికి పర్మిషన్ ఉండదు. ఆ గదిలోకి వెళ్లి వస్తే నీతో ఫ్రెండ్షిప్ చేస్తామని కొందరు పిల్లలు ఫెలిక్స్ తో అంటారు. అప్పుడు ఆ రహస్య గదిలోకి ఫెలిక్స్ వెళ్తాడు.

అందులో కొన్ని వస్తువులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని చూస్తున్న సమయంలోనే ప్రిన్సిపల్ అక్కడికి వస్తుంది. ఫెలిక్స్ ని చూసి ఇక నీకు ఈ స్కూల్లో అడ్మిషన్ లేదని చెప్తుంది. అప్పుడు వెంటనే ఫెలిక్స్ కళ్ళు మూసుకొని ప్రిన్సిపాల్ చాలా చిన్నగా అవ్వాలని అనుకుంటాడు. వెంటనే ప్రిన్సిపల్ ఒక పెన్సిల్ సైజుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత విషయం తెలుసుకుని ఫెలిక్స్ బాధపడతాడు. ఆమెను మళ్లీ అదే గదిలోకి వెళ్లి, పెద్దగా అవ్వాలని కోరుకుంటే సమస్య సాల్వ్ అవుతుందని అక్కడికి మళ్ళీ వస్తాడు. అయితే అక్కడ వైస్ ప్రిన్సిపల్ మోసబుద్ధిని చూపిస్తాడు. స్కూల్ ని మూసేసి ధనవంతుల స్కూల్ గా మార్చాలని ప్లాన్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఫెలిక్స్ ప్రిన్సిపాల్ కి సాయం చేయాలనుకుంటాడు. చివరికి ప్రిన్సిపల్ మామూలు రూపానికి వస్తుందా? స్కూల్ సమస్య సమసిపోతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×