BigTV English

Sidda Raghava Rao: చక్రం తిప్పుతున్న బాలినేని.. జనసేనలోకి మాజీ మంత్రి

Sidda Raghava Rao: చక్రం తిప్పుతున్న బాలినేని.. జనసేనలోకి మాజీ మంత్రి

2014లో చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన శిద్దా రాఘవరావు

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు.. బడా గ్రానేట్ వ్యాపారి.. కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన వ్యాపార అవసరాల కోసం వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆయన భావించినా సాధ్యపడలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి ప్రకాశం లోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.


2004 లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన శిద్దా రాఘవరావు 2004లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో కూడా ఆయన తిరిగి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్టమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి వైసీపీ అభ్యర్ది మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

విజయవాడ వరదల సమయంలో చంద్రబాబుని కలిసిన శిద్దా

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో కొంతకాలం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన శిద్దా తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. అయితే విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తన సోదరులతో వెళ్లి చంద్రబాబును కలిసిన శిద్దా.. వరద బాధితులకు విరాళం ఇచ్చారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబును కలవాలని చూస్తున్నా అది సాధ్యపడటంలేదట.

టీడీపీలో చేరడానికి దామచర్లతో రాయబారం

పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవుల హామీలు లభించక పోయినా తాను మాత్రం టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్ తో రాయబారం నడిపినా అధిష్టానం వైపు నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడం లేదంట. అధినేత నుంచి క్లారిటీ రాక పోవటంతో టీడీపీలో చేరిక కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. శిద్దా టీడీపీలో చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మంత్రి నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది.

Also Read: జగన్ తగ్గుతాడా? ఉప ఎన్నికకు సిద్ధం అవుతాడా?

జనసేనలో చేరడానికి రూట్ క్లియర్ చేస్తున్నారా?

సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే శిద్దా టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందని పార్టీ లోని సీనియర్ నేతలు కూడా శిద్దా తేల్చి చెప్పారట. దీంతో ఆయన చేసేదేమీ లేక అవకాశం కోసం చూస్తూ ఉండి పోయారట. ఇప్పటకే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో శిద్దా రాఘవరావుకి బాలినేని దగ్గర ఉండి వైసీపీ కండువ కప్పించారు. టీడీపీ నుంచి శిద్దాకి లైన్ క్లియర్ కాకపొతే మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి శిద్దాకు జనసేన కండువా కప్పించడానికి బాలినేని రూట్ క్లియర్ చేస్తున్నారంట. శిద్దా జనసేనలో జాయిన్ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి బలమైన ఆర్ధిక అండ దొరకడంతో పాటు ఇటు పార్టి ఎదుగుదలకు ఉపయోగపడుతుందనేది బాలినేని ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి మరి శిద్దా రాఘవరావు ఏ పార్టీ పంచకు చేరతారో?

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×