BigTV English

OTT Movie : ప్రపంచంలోనే బెస్ట్ హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే తప్పు మాత్రం చేయకండి

OTT Movie : ప్రపంచంలోనే బెస్ట్ హర్రర్ మూవీ… ఒంటరిగా చూసే తప్పు మాత్రం చేయకండి

OTT Movie : ఈ హర్రర్ సినిమాలు సౌండ్ ఎఫెక్ట్ తోనే సగం చంపేస్తాయి. మామూలుగానే దయ్యాల సినిమాలు అంటే చాలామందికి ప్యాంట్ తడిచిపోతుంది. ఈ సినిమాలను కనీసం తోడుగా కూడా చూడటానికి భయపడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, హర్రర్ సినిమాలలోనే బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. భయంకరమైన సినిమాలంటే, మొదట గుర్తుకు వచ్చేది ‘ఈవిల్ డెడ్’, ‘ఎగ్జార్సిస్ట్’ . ఈ మూవీ కూడా ఈ కోవలేకే వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైకలాజికల్ హర్రర్ మూవీ పేరు’హెరిడిటరీ’ (Hereditary). 2018 లో విడుదలైన ఈ మూవీకి ఆరీ ఆస్టర్ దర్శకత్వం వహించారు. ఇందులో టోనీ కొల్లెట్, అలెక్స్ వోల్ఫ్, మిల్లీ షాపిరో, ఆన్ డౌడ్, గాబ్రియేల్ బైర్నే నటించారు. ఈ సినిమా ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల వీళ్ళు ప్రస్తుతం గడ్డుపరిస్తితిని ఎదుర్కుంటారు. ఇది భావోద్వేగాలు, అతీంద్రియ శక్తులతో నిండిన మూవీ. హెరిడిటరీ జనవరి 21, 2018 లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లో జూన్ 8, 2018న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ సానుకూల ప్రశంసలను అందుకుని $87 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

అన్నీ గ్రాహం అనే మహిళ తన భర్త స్టీవ్, కుమారుడు పీటర్, కుమార్తె చార్లీ తో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన తల్లి ఎలెన్ మరణం తర్వాత ఆమె శోకంలో మునిగి పోతుంది. ఎలెన్ మరణం తర్వాత, ఈ కుటుంబం విచిత్రమైన, భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటుంది. చార్లీ అనే చిన్న పాప, ఎలెన్‌తో చాలా ప్రేమ గా ఉండేది. ఒక రోజు, ఒక ప్రమాదంలో చార్లీ కూడా మరణిస్తుంది. ఇది ఈ కుటుంబాన్ని మరింత బాధల్లోకి నెట్టివేస్తుంది. అన్నీ తన బాధలను ఎదుర్కోవడానికి ఒక సపోర్ట్ గ్రూప్‌లో చేరుతుంది. అక్కడ ఆమె జోన్ అనే మహిళను కలుస్తుంది. జోన్, అన్నీకి ఆత్మలతో సంప్రదించే విధానాన్ని నేర్పిస్తుంది. ఇది స్టోరీని మరింత భయంకరమైన మలుపు తిప్పుతుంది. అన్నీ తన తల్లి ఎలెన్ ఒక రహస్యమైన కల్ట్‌లో సభ్యురాలని, ఆమె పైమన్ అనే దెయ్యం ను ఆరాధించేదని తెలుసుకుంటుంది.

ఈ కల్ట్ ఉద్దేశం పైమన్‌ను భూమిపైకి తీసుకురావడం. అయితే భూమి మీదకి ఆ దయ్యం రావడానికి, పీటర్ శరీరం అవసరం అవుతుంది. ఈ కుటుంబానికి ఉన్న వంశపారంపర్య శాపం కారణంగా , దెయ్యం ప్రభావం వల్ల వారి జీవితాలు ప్రమాదకర స్తాయికి చేరుకుంటాయి. అన్నీ, స్టీవ్ ఆ దయ్యం చేత దారుణంగా చంపబడతారు. ఆ తరువాత పీటర్ ని ఆ పైమన్ దయ్యం ఆవహిస్తుంది. చివరికి కల్ట్ సభ్యులు పీటర్‌ను ఒక రాజుగా ఆరాధించడం మొదలు పెడతారు. ఈ సినిమాలో భయంకరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×