OTT Movie : కొన్ని సినిమాలు చూసిన వెంటనే మరచిపోతూ ఉంటాం. కొన్ని సినిమాలు చాలా కాలం వరకు గుర్తుకు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒకసారి చూస్తే, మరచిపోయే విధంగా ఉండదు. ఈ మూవీలో హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకుని, తనను తాను తెలుసుకోవడానికి ఒక యాత్ర చేస్తుంది. ఈ యాత్ర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. చివరివరకూ ఈ మూవీ మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. ఎంతో కొంత ఈ మూవీని చూసినవాళ్ళకి కూడా మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బయోగ్రాఫికల్ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘ఈట్, ప్రే, లవ్’ (Eat, Pray, Love). 2010 లో విడుదలైన ఈ మూవీకి ర్యాన్ మర్ఫీ దర్శకత్వం వహించారు. ఇందులో ఎలిజబెత్ గిల్బర్ట్ పాత్రలో జూలియా రాబర్ట్స్ నటించారు. ఆమె ఇందులో ఒక యాత్ర వలన, జీవితాన్ని మార్చుకుంటుంది. ఈ మూవీ $60 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $204 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఎలిజబెత్ గిల్బర్ట్ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక విజయవంతమైన రచయిత్రి కావడంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి. ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ముందుకు వెళ్తుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సంతోషకరంగా ఉండదు. పెళ్లి జరిగినా కూడా జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉంటుంది ఎలిజబెత్. కొంతకాలం తరువాత ఈమె భర్తతో విడాకులు కూడా తీసుకుంటుంది. ఇక ఆమె తనను తాను తిరిగి కనుగొనడానికి ఒక సంవత్సరం పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆమె ఇటలీ, ఇండియా, ఇండోనేషియా మూడు దేశాలను సందర్శిస్తుంది. ప్రతి దేశంలో ఆమె జీవితంలోని విభిన్న అంశాలను తెలుసుకుంటుంది. మొదటగా ఇటలీ లో ఆహారం మీద దృష్టి పెడుతుంది. ఆమె రుచికరమైన ఇటాలియన్ వంటకాలను ఆస్వాదిస్తూ, జీవితంలోని ఆనందమైన క్షణాలను వెతుక్కుంటుంది.
ఇక్కడ ఆమె కొత్త స్నేహితులను చేసుకుంటూ, తనలోని ఒంటరి తనాన్ని పోగొట్టుకుంటుంది. ఆ తరువాత ఇండియాలోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతను తెలుసుకుంటుంది. ధ్యానం, ఆత్మపరిశీలన ద్వారా ఆమె తన లోపల, శాంతిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. చివరగా ఇండోనేషియాలోని బాలిలో, ఒక స్థానిక వైద్యుడు కెటుట్ లియర్‌తో స్నేహం చేస్తుంది. ఫెలిపే అనే బ్రెజిలియన్ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఈ అనుభవం ఆమెకు ప్రేమ, సంబంధాల గురించి కొత్త అనుభూతిని ఇస్తుంది. చివరికి ఆమె తనగురించి తాను ఏమి తెలుసుకుందో, పూర్తిగా తెలియాలంటే ఈ బయోగ్రాఫికల్ రొమాంటిక్ డ్రామా మూవీని చూడండి. తనని తాను అన్వేషించడానికి ఒక యాత్ర ఎంతగా ఉపయోగ పడుతుందో ఈ మూవీలో చూపించారు. ఒంటరిగా బాధపడే వాళ్ళు ఈ మూవీపై ఓ లుక్ వేయండి.