E-Paper
Advertisement

OTT Movies :  భయంకరమైన హారర్ సీన్లు.. గుండెల్లో దైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..

OTT Movies :  భయంకరమైన హారర్ సీన్లు.. గుండెల్లో దైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..
Advertisement

OTT Movies :  హారర్ సినిమాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు భయపడాలని చూస్తే.. మరికొందరు మాత్రం ఎలా ఉంటాయో చూడాలనే ఆత్రుతతో చూస్తారు. ఓటీటీ సంస్థలు ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినిమాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. గత ఏడాది బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఉంది. భయంకరమైన సన్నివేశాలతో ఒంటరిగా గుండెలు జారి పోయేలా ఉండే సీన్లతో కూడిన ఓ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

మూవీ & ఓటీటీ..

Advertisement

హారర్ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని సినిమాలు కూడా ఓటీటీలో భారీ వ్యూస్ ను రాబట్టి హిట్ అవుతున్నాయి. అలాంటి ఓ హారర్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజై ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూల్ చేసింది నోస్ఫెరాటు.. కొన్నాళ్లుగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది.. ప్రస్తుతం ఓటీటీలోకి వస్తున్నా మూవీ పేరు నోస్ఫెరాటు.. ఈ సినిమా మే 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏడాది తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తుంది. ఇందులో బిల్ స్కార్స్‌గార్డ్, లిలీ రోజ్ డెప్, నికోలస్ హౌల్ట్, ఆరోన్ టేలర్ జాన్సన్, ఎమ్మా కోరిన్, రాల్ఫ్ ఇనేసన్ లాంటి వాళ్లు నటించారు.

మూవీ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ఇదొక భయంకరమైన హారర్ స్టోరీ మూవీ. ఎలెన్ హట్లర్ అనే ఓ యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నిద్రలో చిత్రవిచిత్రమైన భయంకర రూపాలు కనిపిస్తుంటాయి. కౌంట్ ఓర్లోక్ అనే ఓ పిశాచి ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెను ఎలా లోబరుచుకున్నాడు? లేదా? ఏం చేశాడు అన్నది మూవీ స్టోరీ.. నాలుగు కేటగిరీల్లో ఆస్కార్స్ నామినేషన్లు కూడా అందుకున్న సినిమా ఇది. అద్భుతమైన ఫొటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కౌంట్ ఒర్లోక్ అనే పిశాచిగా బిల్ స్కార్స్‌గార్డ్ నటన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు తెచ్చిపెట్టింది.. గతంలో ఈ మూవీ జీ5, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటిటి సంస్థల్లో స్ట్రీమింగ్అయింది.. అయితే అక్కడ రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాని ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంది.. హారర్ సినిమాలంటే నచ్చేవాళ్ళు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయ్యండి.. ఇవే కాదు ఇలాంటి మరెన్నో సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నాయి. ఈ సమ్మర్ ను వరుస సినిమాలతో గడిపేయండి..

అటు థియేటర్లో కూడా ఈ నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండడంతో యూత్ ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×