Horror Movie In OTT : ఓటీటీలో ఎప్పుడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయని మూవీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఎందుకంటే ఓటీటీలో థియేటర్లలో కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వారానికి 20 పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ మూవీల కు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే. తాజాగా మరో హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని చూడాలంటే గుండె ధైర్యం ఎక్కువగానే ఉండాలని మేకర్స్ అంటున్నారు. అంతగా భయపెట్టే సన్నివేశాలు ఆ మూవీలో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమా పేరు బ్యాగ్ మ్యాన్.. ఇది సెప్టెంబర్ 20 న థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ సినిమా.. మూడు నెలల తర్వాత ఇప్పుడు ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. పిల్లలను బ్యాగులో బంధించి ఎత్తుకెళ్లిపోయే ఓ వింత జీవి చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. థియేటర్లలో మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు.. అందుకే లేటుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. అందరు సబ్‌స్క్రైబర్లకు కాకుండా కేవలం రూ.149 ఎక్సట్రా చెల్లించిన వారికి మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం కల్పించింది ప్రైమ్ వీడియో. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. భయానక సన్నివేశాలతో గుండెల్లో వణుకుపుట్టిస్తుంది. ఈ సినిమాను కొత్తగా ఏమి క్రియేట్ చెయ్యలేదు. అందుకే థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయింది. ఓ వ్యక్తికి తన తండ్రి చిన్నతనంలో చెప్పిన బ్యాగ్‌మ్యాన్ స్టోరీ నిజమైనట్లుగా అనిపిస్తుంది. ఈసారి అతడు తన కోసం కాకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి. ఇది స్టోరీ.. నిజానికి అతను ఎలా బ్యాగ్ మ్యాన్ తో ఫైట్ చేశాడన్నది స్టోరీ..
బయట ఒంటరిగా ఉంటున్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని, వాళ్లను బొమ్మలు, చాక్లెట్ల తో ఆకర్షించి, బ్యాగులో బంధించి తీసుకెళ్లి చంపే బ్యాగ్‌మ్యాన్ అసలు ఎవరు? అతని నుంచి హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. కామ్ మెక్‌కార్తీ డైరెక్ట్ చేసిన ఈ బ్యాగ్‌మ్యాన్ మూవీలో సామ్ క్లాఫ్లిన్, ఆంటోనియా థామస్, కారెల్ విన్సెంట్ రోడెన్ వంటి ప్రముఖ నటులు ఇందులో నటించారు. థియేటర్లలో ఆకట్టుకోలేని ఈ సినిమా ఇక్కడ ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి.. ఇటీవల థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు ఓటీటీ లో సక్సెస్ అవుతున్నాయి. ఇక ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మంచి టాక్ ను అందుకుంటున్నాయి..