Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ.. సంక్రాంతి పండగ విడదీయలేని అనుబంధం. పండగ ఎంత ఘనంగా జరిగినా ఆరోజు బాలయ్య సినిమా లేకపోతే ప్రేక్షకులకు అసలు పండగ పూర్తీకాన్నట్లే. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి అంటూ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బాలయ్య.. వచ్చే ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ గా రానున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డాకు మహారాజ్. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ అందించిన బాబీ.. ఈసారి బాలయ్యకు హిట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను కూడా పెంచేసింది. ఈ చిత్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.
Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి.. కూతురు ముందే ఏం చెప్పిందంటే.. ?
ఇక గత కొన్ని రోజులుగా సంక్రాంతి బరి నుంచి డాకు మహారాజ్ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ చేసుకుంటూనే ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. కానీ, ఇప్పటివరకు డాకు మహారాజ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి సినిమా వెనక్కి తగ్గిందని, స్ట్రాంగ్ పోటీ ఉండడంతో.. ఆ బరిలో ఎందుకు అని అనుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది.
Mega Brothers: అన్న అయ్యప్ప మాల.. తమ్ముడు హనుమాన్ మాల.. బావుందిగా
తాజాగా మేకర్స్.. డాకు మహారాజ్ నుంచి ఒక కీలకమైన అప్డేట్ ను అభిమానులకు అందించారు. నేటితో డాకు మహారాజ్ షూటింగ్ పూర్తీ అయ్యిందని, సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిపారు.
“డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయింది, ఈ సంక్రాంతికి పెద్ద స్క్రీన్‌లలో మాస్ స్ట్రోమ్ కోసం సిద్ధంగా ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 న పవర్ ప్యాక్డ్ మాస్ సంభవం మొదలు కానుంది” అంటూ రాసుకొచ్చారు. దీంతో పాటు ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో డైరెక్టర్ బాబీ.. బాలయ్యకు సీన్ వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. డాకు మహారాజ్ గెటప్ లోనే బాలయ్య కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Pushpa 2 Movie Release : మెగా సస్పెన్స్… ఈ మెగా మేనల్లుడి ట్విట్టర్‌పై వేయి కళ్లు..
ఇక ఈ అప్డేట్ ను చూసిన ఫ్యాన్స్.. బాలయ్య సినిమా వెనక్కి తగ్గేదేలే.. సంక్రాంతి బరిలో దిగడమే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు షూటింగ్ అయిపోయింది కదా.. ప్రమోషన్స్ మొదలుపెట్టండి.. మొదటి సాంగ్ రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కనీసం ఇప్పటినుంచైనా ప్రమోషన్స్ మీద ఫోకస్ చేస్తే.. మిగతావాటికి సమానంగా వస్తారని అంటున్నారు. మరి ఈ మూడు సినిమాలో సంక్రాంతి 2025 విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలంటే ఇంకో నెల ఆగాల్సిందే.
The shoot of #DaakuMaharaaj is wrapped, We’re all set for the MASS STORM on big screens this Sankranthi! 🔥⚡️
Teaser – https://t.co/dquussIKTj
Brace yourselves for the ultimate 𝐏𝐨𝐰𝐞𝐫-𝐏𝐚𝐜𝐤𝐞𝐝 𝐌𝐀𝐒𝐒 𝐄𝐗𝐏𝐋𝐎𝐒𝐈𝐎𝐍 n Jan 12, 2025 in Cinemas Worldwide. 🤙🏻🔥
𝑮𝑶𝑫… pic.twitter.com/KdVgfniPBH
— Sithara Entertainments (@SitharaEnts) December 3, 2024