OTT Movie : ప్రతీకారంతో రగిలిపోయే సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కిల్లర్ సైలెంట్ గా చంపుతూ పోతుంటాడు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు. కేవలం పక్షుల శబ్దాలు, ఆకుల శబ్దాలు మాత్రమే వినపడుతుంటాయి. ఈ మూవీలో మర్డర్ జరిగేటప్పుడు, చాలా భయంకరంగా ఉంటుంది. పగలు చూస్తే పగలే కలలోకి వచ్చే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కెనడియన్ స్లాషర్ మూవీ పేరు ‘ఇన్ ఎ వయలెంట్ నేచర్’ (In a Violent Nature). 2024 లో వచ్చిన ఈ మూవీకి క్రిస్ నాష్ దర్శకత్వం వహించారు. ఇందులో రై బారెట్, ఆండ్రియా పావ్‌లోవిక్, లారెన్-మేరీ టేలర్ నటించారు. యాంబియంట్ స్లాషర్ గా వర్ణించబడిన ఈ మూవీ ఒక మూగ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతన్ని అంటారియో అరణ్యంలో సమాధి చేసి ఒక లాకెట్ తో బంధిస్తారు. అనుకోకుండా కొంతమంది యువకులు ఆ లాకెట్ ను దాని నుంచి తొలగిస్తారు. అతనికి మళ్ళీ ప్రాణం వచ్చి, వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ మూవీలో సంఘటనలు ఎక్కువగా కిల్లర్ కోణం నుండి చిత్రీకరించారు. ఈ మూవీ 2024 మే 31 న యునైటెడ్ స్టేట్స్, కెనడాలో థియేట్రికల్‌గా విడుదల చేయబడింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ ఒక అడవిలోని పాడుబడిన ఫైర్ టవర్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ టవర్‌లో జానీ అనే వ్యక్తి కుళ్ళిపోయిన శవం ఉంటుంది. అతని ఆకారం ఒక దెయ్యంలా ఉంటుంది. ఈ శవాన్ని ఒక లాకెట్ ద్వారా నియంత్రణలో ఉంచి ఉంటారు. కొంతమంది యువకులు ఆ లాకెట్‌ను తీసుకుంటారు. దీంతో జానీకి మళ్లీ ప్రాణం వస్తుంది. ఈ లాకెట్ అతని తల్లి జానీకి ఇచ్చి ఉంటుంది. దానిని అతడు చాలా ప్రత్యేకంగా చూసుకునేవాడు.ఇప్పుడు జానీ ఒక భీకరమైన సైలెంట్ కిల్లర్ గా మారుతాడు. అతను ఆ లాకెట్‌ను తిరిగి పొందడానికి బయలుదేరతాడు. దారిలో వచ్చే ప్రతి ఒక్కరినీ క్రూరంగా చంపుకుంటూ పోతాడు. ఈ యువకులు ఒక క్యాబిన్‌లో విహారయాత్రకు వచ్చి ఉంటారు. మిగిలిన వాళ్ళు, జానీ గురించి ఒక కథ వింటారు. అతను చిన్నతనంలో మానసిక వైకల్యంతో బాధపడుతూ, కొంతమంది టార్చర్ చేయడం వల్ల, ఒక ఫైర్ టవర్ నుండి పడి మరణించాడని తెలుస్తుంది.
జానీ తండ్రి ఈ సంఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించి చనిపోతాడు. జానీ ఆ తర్వాత ఒక ప్రతీకార ఆత్మగా మారిపోతాడు. సినిమా ఎక్కువగా జానీని అనుసరిస్తుంది. అతను అడవిలో నడుస్తూ, తన బాధితులను వేటాడుతూ ఉంటాడు. అతను వివిధ ఆయుధాలను ఉపయోగించి భీకరమైన, రక్తపాతంతో కూడిన హత్యలు చేస్తాడు. ఈ హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. ఇది సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ యువకులలో క్రిస్ అనే అమ్మాయి, కోల్ట్ అనే అబ్బాయి జానీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి క్రిస్ మాత్రమే బయటపడుతుంది. ఆమె ఒక రహదారిపై ఒక మహిళ సహాయంతో తప్పించుకుంటుంది.