Jailer 2 OTT: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం జైలర్ 2(Jailer 2). దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ సినిమాకి రాని విధంగా ఈ సినిమా సుమారు 800 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా రజినీకాంత్ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక థియేటర్లలో విజయవంతంగా ప్రసారమైన జైలర్ 2 సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారక విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ తెలియజేసింది.. ఈ సినిమా నవంబర్ 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి ఉండబోతుందని తెలియజేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రసారం కాబోతోందని తెలియజేశారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ థియేటర్లలో విడుదల కాగా నవంబర్ 12వ తేదీన డిజిటల్ మీడియాలోకి రాబోతోంది.
జైలర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టినప్పటికీ నెల తిరగకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఇక ఈ సినిమాలో సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా భాగమైన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, మోహన్, లాల్, శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగి బాబు, ఎస్ జె సూర్య, విద్యాబాలన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు నవంబర్ 12వ తేదీ నుంచి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED 🔥#Jailer2OnPrime, Nov 12@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu pic.twitter.com/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
ఇకపోతే జైలర్ 2 సినిమా థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓటీటీలో చూసే విధంగా మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. థియేటర్లో ప్రసారం కానీ కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేశారని తెలుస్తుంది. సుమారు 30 నిమిషాల అదనపు సన్నివేశాలను జోడించి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే తిరిగి ఈ సినిమా ఓటీటీలో కూడా సంచలనంగా మారుతుందని చెప్పాలి. మరి ఈ విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: వామ్మో రోహిత్ వల్ల బిగ్ బాస్ కి ఇంత నష్టమా.. అందుకే ఎలిమినేట్ అయ్యాడా?