E-Paper
Advertisement

చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా

చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా
Advertisement

Japanese Romantic Drama: సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలకు జపనీస్ మేకర్స్ పెట్టింది పేరు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే లైన్ అస్సలు ఊహించలేము. సరిగ్గా అలాంటి నెవర్ బిఫోర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఒక జపనీస్ మూవీ గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా అలరించేందుకు సిద్దమైంది. జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆరాటంలో చాలామంది తమకిష్టమైన విషయాలను పక్కన పెడుతుంటారు. రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు ఆనందాలను వాయిదా వేస్తుంటారు. కానీ మనకు ఉన్న సమయం ఎంతనేది ముందే తెలిసిపోతే? అప్పటివరకు దాచుకున్న డబ్బును ఖర్చు పెట్టి అయినా మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలని అనిపిస్తే? ఇలాంటి ఒక డిఫరెంట్ పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జపనీస్ రొమాంటిక్ డ్రామానే ‘One Year to Live, Buy a Man’. టైటిల్ వినగానే ఇదేదో వింత కథ అనిపించినా, ఇందులో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మాత్రం ఆలోచింపజేస్తుంది. మరి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీ ఏమిటంటే?

ఈ సినిమా కథ 40 ఏళ్ళ ఒక ఒంటరి మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె లైఫ్ అంతా కెరీర్ కోసమే త్యాగం చేసింది. అయితే అనూహ్యంగా ఒకరోజు మెడికల్ చెకప్‌లో ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి ఉందని, ఆమె బ్రతకడానికి కేవలం ఒకే ఒక్క సంవత్సరం టైమ్ ఉందని డాక్టర్లు చెప్తారు. చేతిలో కోట్ల కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, తన కోసం బాధపడే తోడు ఎవరూ లేరని ఆమె రియలైజ్ అవుతుంది. దాంతో ఆమె లైఫ్ లోనే అత్యంత క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఒక డార్క్ వెబ్‌సైట్ ద్వారా భారీగా లక్షల రూపాయలు చెల్లించి, 20 ఏళ్ల ఒక యంగ్ కుర్రాడిని ఒక సంవత్సరం పాటు తనతో ఉండటానికి కొనుక్కుంటుంది.

Advertisement

ఇక్కడి నుండి సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఆ కుర్రాడు డబ్బు కోసం ఆమె పెట్టిన ప్రతి కండిషన్‌కు ఒప్పుకుంటాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, చావు అంచుల్లో ఉన్న ఆ 40 ఏళ్ల మహిళకు, కేవలం డబ్బు కోసమే వచ్చిన ఆ కుర్రాడికి మధ్య ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఆమె తన జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను ఆ కుర్రాడి సహాయంతో ఎలా తీర్చుకుంది? చివరకు చావు సమయం దగ్గర పడినప్పుడు ఆ కుర్రాడి మైండ్ సెట్ ఎలా మారింది? అనేది స్క్రీన్ పై చూడాల్సిందే. ఈ మూవీలో విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉంటూ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుండెకు హత్తుకుంటుంది.

ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

‘One Year to Live, Buy a Man’ సినిమా 2026 నవంబర్ 5 నుంచి Netflixలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ జపనీస్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. రొటీన్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. ఈ చిత్రంలో యుయి కటకురా పాత్రలో జపనీస్ నటి కో షిబాసాకి (Ko Shibasaki), సేనా పాత్రలో ఈజీ అకాసో (Eiji Akaso) నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రముఖ రచయిత్రి టోరికో యోషికావా రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమాకు హిరోకి కజామా దర్శకత్వం వహించారు.

Advertisement

Read Also: కొడుకుకు నచ్చిన బొమ్మను కొనివ్వడానికి సిటీని పీకి పందిరేసే తండ్రి… ఎపిక్ ఎమోషనల్ మూవీ

Tags

Related News

ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 9 తెలుగు సినిమాలు, సిరీస్ లు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

ఖైదీల వరుస మర్డర్స్… కనిపించని దెయ్యాన్ని పట్టుకోవడానికి తంటాలు… జైలు అంటేనే జడిపించే హారర్

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓవైపు… వెంటాడుతున్న కరడుగట్టిన క్రిమినల్ మరోవైపు… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

5 కోట్లు మాయం… రెండేళ్ల క్రితమే కన్నుమూసిన డైరెక్టర్ చివరి సినిమా… ప్రియమణి కొత్త క్రైమ్ థ్రిల్లర్ ని ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×