Bigg Boss 10 Rohit Naidu: బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో రోహిత్ నాయుడు(Rohit Naidu ) ఒకరు. సామాన్యుడిగా అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక అయిన రోహిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటినుంచి రోహిత్ ఆట తీరు చూసిన అభిమానులు ఈయన విన్నర్ కాంపిటీషన్లో ఉన్నారని భావించారు. అయితే ఊహించని విధంగా రోహిత్ బిగ్ బాస్ నుంచి ఎనిమిదవ వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా రోహిత్ ఎనిమిదవ వారం హౌస్ నుంచి ఎనిమినేట్ కావడంతో అది అన్ ఫైర్ ఎలిమినేషన్ అని, ఆయన ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా రోహిత్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఈయన ఎలిమినేషన్ గురించి ఎంతోమంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వారి అభిప్రాయాలను తెలిపారు. తాజాగా శేఖర్ భాష (Sekhar Basha)ఒక ఇంటర్వ్యూలో భాగంగా రోహిత్ గురించి సంచలన విషయాలను తెలియచేశారు. తనకు అందిన సమాచారం ప్రకారం రోహిత్ నాయుడు కారణంగా బిగ్ బాస్ చాలా నష్టాలను ఎదుర్కొందని శేఖర్ భాషా సంచలన విషయాలను బయటపెట్టారు. రోహిత్ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో బిగ్ బాస్ ని ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని శేఖర్ భాషా తెలిపారు.
బిగ్ బాస్ నువ్వు కావాలని నన్ను తొక్కేస్తున్నావు.. త్రిగుణ్ ను లేపడానికి ట్రై చేస్తున్నావు.. సెలబ్రిటీలకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటూ రోహిత్ మాట్లాడారు. అయితే ఇది బిగ్ బాస్ కి సంబంధించి కాస్త పర్సనల్ విషయం కావడంతో బయటకు చూయించలేదని, తనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందని శేఖర్ బాషా తెలిపారు. బిగ్ బాస్ కు అలాంటి ఇంటెన్షన్ ఉండొచ్చు కానీ నువ్వు ఏకంగా బిగ్ బాస్ ని రాజకీయాలలోకి లాగేస్తున్నావని రోహిత్ మాట్లాడినట్టు శేఖర్ భాష తెలిపారు. బిగ్ బాస్ సెలబ్రిటీలను లేపడానికి కూడా కారణం ఉందని ఈయన తెలిపారు.
బిగ్ బాస్ సెలబ్రిటీలకు ఎందుకు ఫెవర్ గా ఉందనే విషయం గురించి శేఖర్ భాష మాట్లాడుతూ ఇప్పుడు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లడానికి సెలబ్రిటీలు ఎవరు ఒప్పుకోలేదని తెలిపారు. గత సీజన్లలో ఇంట్రెస్ట్ చూపించారు ఈ సీజన్ లో ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో రోహిత్ నే కారణంగా చూపిస్తున్నారని శేఖర్ భాష తెలిపారు. రోహిత్ మాట్లాడే విధానం సరిగా లేదు అక్కడ ఉన్న వారిని అవమానకరంగా మాట్లాడటం, త్రిగుణ్ తో మాట్లాడుతూ నీ చెంప పగులుతుంది.. బయటకురా చూసుకుందాం అంటూ మాట్లాడిన విధానం సెలబ్రిటీలకు నచ్చలేదని ఇలా సెలబ్రిటీలుగా మంచిగా బ్రతికి అక్కడికి వెళ్ళి అవమానపడటం ఎందుకు అంటూ చాలామంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డుకు నో చెప్పారని శేఖర్ భాష తెలిపారు. రోహిత్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ కి నష్టాలు వచ్చాయని అందుకే తనని బయటకు పంపించారని తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!