BoAt Rockerz 371: ఆడియో టెక్నాలజీ మార్కెట్‌లో..బడ్జెట్ ధరలో.. బెస్ట్ ప్రొడక్ట్స్‌ను అందించడంలో.. బోట్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు అదే.. కోవలో మరో అద్భుతమైన హెడ్ సెట్‌తో మన ముందుకు వచ్చింది. అదే బోట్ రాకర్జ్ 371 ఆన్-ఇయర్ వైర్‌లెస్ హెడ్ సెట్. కేవలం రూ.999ధరకే లభిస్తున్న ఈ హెడ్‌సెట్, మార్కెట్‌లో.. ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా.. బ్లాక్ సేబర్ కలర్ ఆప్షన్‌లో.. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా,ట్రెండీగా కనిపిస్తున్నాయి. మరి ఈ హెడ్ సెట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి. రూ.1000 లోపు బడ్జెట్‌కి.. ఇవి ఎంత వరకు న్యాయం చేస్తాయనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ హెడ్‌సెట్ డిజైన్ విషయానికి వస్తే.. చాలా ప్రీమియం లుక్‌ని కలిగి ఉంది. బ్లాక్ సేబర్ ఫినిషింగ్ దీనికి ఒక మోడర్న్ టచ్‌ని ఇస్తుంది. చెవులపై.. పెట్టుకునే ఆన్-ఇయర్ డిజైన్‌తో దీన్ని తయారు చేసారు. దీని కుషన్స్ చాలా మృదువుగా ఉండటం వల్ల ఎక్కువ సేపు.. వాడినప్పటికీ చెవులకు ఎలాంటి నొప్పి రాకుండా లైట్ వెయిట్‌గా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి, ఆన్‌లైన్ క్లాసులు వినే..వారికి లేదా ఆఫీస్ వర్క్ చేసుకునే వారికి.. ఈ డిజైన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ ప్రైస్ రేంజ్‌లో.. లేటెస్ట్ బ్లూటూత్ ..v5.4 టెక్నాలజీతో రావడం నిజంగా విశేషం. ఇది మునుపటి.. వెర్షన్ల కంటే.. చాలా వేగంగా.. స్టెబిలిటీతో కనెక్ట్ అవుతుంది. ఆడియో లాగ్ సమస్యలు లేకుండా.. ఉండటానికి,అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని కనెక్షన్ కోసం.. ఈ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫోన్ లేదా ల్యాప్ టాప్‌తో ఇది ఇన్‌స్టంట్‌గా పేర్ అయిపోతుంది.
సౌండ్ పరంగా బోట్ హెడ్‌సెట్లు ..ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ రాకర్జ్ 371 హెడ్‌సెట్‌లో 40mm లార్జ్ డ్రైవర్లను అందించారు. దీని వల్ల బేస్ చాలా డీప్‌గా ఉంటుంది. కాబట్టి క్రిస్టల్ క్లియర్ వోకల్స్‌తో మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. మీరు బీట్స్ ఉన్న సాంగ్స్ వింటున్నా లేదా సినిమాలు చూస్తున్నా థియేటర్ లాంటి ..ఆడియో ఫీల్ తప్పకుండా కలుగుతుంది.
గేమింగ్ లవర్స్ దృష్టిలో ఉంచుకొని..ఇందులో ప్రత్యేకంగా BEAST మోడ్ అందించారు. ఈ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా లో-లేటెన్సీ లభిస్తుంది. అంటే గేమ్ ఆడేటప్పుడు సౌండ్ సింక్ కరెక్ట్‌గా ఉంటుంది, దీని వల్ల ప్రత్యర్థుల అడుగుల చప్పుళ్లు కూడా స్పష్టంగా వినిపించి గేమింగ్ ఫీల్ మెరుగు పరుస్తుంది.
Also Read: తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి
బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాలంటే.. ఇది ఈ ప్రైస్ రేంజ్‌లో నమ్మలేని విధంగా భారీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఒక్క ఛార్జ్‌పై.. ఇది ఏకంగా 50 గంటల ప్లేటైమ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజూ ఛార్జ్ చేయాల్సిన పనే ఉండదు. అలాగే.. కాలింగ్ సమయంలో శబ్దాలను తగ్గించడానికి ENx టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
రూ.999 ధరలో.. బ్లూటూత్ v5.4, 50H బ్యాటరీ, 40mm డ్రైవర్లు, బీస్ట్ మోడ్ వంటి ఫీచర్లు అంటే ఇది నిజంగా.. ఒక గ్రేట్ డీల్ అనే చెప్పాలి. మీరు తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్‌తో.. పాటు మంచి ఫీచర్లు ఉన్న వైర్ లెస్ హెడ్ సెట్ కోసం చూస్తున్నట్లయితే.. బోట్ రాకర్జ్ 371 నిస్సందేహంగా ఒక ఎక్సలెంట్ ఛాయిస్ అవుతుంది.