E-Paper
Advertisement

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ
Advertisement

Period Medical Drama: ఈ మధ్యకాలంలో కె-డ్రామాలకు (Korean Dramas) తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. కేవలం యాక్షన్, రొమాన్స్ కాకుండా లైఫ్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ స్టోరీస్ ని కొరియన్ మేకర్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ కోవకు చెందినదే ‘Poong, the Joseon Psychiatrist’ కొరియన్ వెబ్ సిరీస్. జోసోన్ కాలం నాటి పీరియడ్ మెడికల్ డ్రామాగా వచ్చిన ఈ క్రేజీ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. మనసుకి హత్తుకునే విజువల్స్ తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు.

కథలోకి వెళ్తే..

యూ సే-పూంగ్ (కిమ్ మిన్-జే) రాయల్ ప్యాలెస్ లోనే అత్యంత ప్రతిభావంతుడైన అక్యుపంక్చర్ డాక్టర్. రాజకుటుంబానికి చికిత్స చేసే అతనంటే అందరికీ ఎంతో గౌరవం. కానీ, ఒక పెద్ద కుట్ర కారణంగా ప్యాలెస్ లో ఒక రాయల్ మెంబర్ మరణిస్తాడు, ఆ నింద పూంగ్ పై పడుతుంది. దాంతో అతను ఆ రాజభవనాన్ని వదిలేసి రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. ఆ మానసిక బాధతో అతను తన అక్యుపంక్చర్ స్కిల్ ని కూడా కోల్పోతాడు.

Advertisement

ఆ తర్వాత పూంగ్ ఒక చిన్న విలేజ్ లో ఉన్న గ్యెసు క్లినిక్ కి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక విచిత్రమైన డాక్టర్, ఒక వితంతువు అయిన సీయున్-వూ పరిచయమవుతారు. అక్కడ పూంగ్ కి ఒక విషయం అర్థమవుతుంది.. కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసు ముక్కలైన వాళ్లకి కూడా వైద్యం అవసరమని. అలా అతను ఆ ఊరి ప్రజల మానసిక సమస్యలను, గుండె గాయాలను నయం చేసే సైకియాట్రిస్ట్‌గా మారుతాడు. ఈ ప్రాసెస్ లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ ఆడియన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయి. ఒక బ్యూటిఫుల్, పీస్ ఫుల్ ఫీల్ గుడ్ సిరీస్ చూడాలనుకుంటే ప్రైమ్ లో దీన్ని వెంటనే చూసేయండి.

తెలుగులో చూడొచ్చా ? 

‘Poong, the Joseon Psychiatrist’ కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ప్రతి ఎపిసోడ్ మనసుని ప్రశాంతంగా మార్చే ఒక ‘హీలింగ్ మెడిసిన్’ లాంటిది. ఇందులో కిమ్ మిన్-జే, కిమ్ హ్యాంగ్-గి ల మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్‌గా ఉంటుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, అక్కడి క్యారెక్టర్స్ చేసే కామెడీ సిరీస్‌ను ఎక్కడా బోర్ కొట్టించకుండా చూస్తాయి. ఈ క్లాసిక్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో లభిస్తోంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం అందబాటులో లేదు. ఇది తెలుగు ఓటీటీ ఆడియన్స్ కి కొంచె నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి.

Advertisement

Read Also: ట్విస్ట్ అంటే ఇదీ… మర్డర్ కేసు కోసం మగాడిగా మారే లేడీ డిటెక్టివ్… మతిపోగొట్టే మలుపులున్న కామెడీ సిరీస్

Related News

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓవైపు… వెంటాడుతున్న కరడుగట్టిన క్రిమినల్ మరోవైపు… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

5 కోట్లు మాయం… రెండేళ్ల క్రితమే కన్నుమూసిన డైరెక్టర్ చివరి సినిమా… ప్రియమణి కొత్త క్రైమ్ థ్రిల్లర్ ని ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌… జాతి వివక్షను ఎదిరించి ప్రపంచాన్నే షేక్ చేసిన బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ రియల్ స్టోరీ

Big Stories

Advertisement
×