Fantasy Adventure Series: యానిమేషన్ ప్రపంచంలో జపనీస్ ఫాంటసీ సిరీస్‌లకు ఉండే క్రేజే వేరు. విజువల్ వండర్ గా, అద్భుతమైన అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో రీసెంట్‌గా యానిమే లవర్స్‌ను ఊపేస్తోన్న సరికొత్త జపనీస్ యానిమే సిరీస్ ‘ది సెవెన్ నైట్స్ ఆఫ్ ది మేరోనియర్ కింగ్‌డమ్’ (The Seven Knights of the Marronnier Kingdom). నావో ఇవామోటో రాసిన పాపులర్ అవార్డ్ విన్నింగ్ ‘మాంగ’ ఆధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన ఫాంటసీ యానిమే సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. దీని కథ ఏమిటి ? ఎక్కడ చూడచ్చు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సిరీస్ కథ ఎనిమిది రాజ్యాలు ఉన్న ఒక పురాతన ఖండంలో జరుగుతుంది. ఆ ఖండం మధ్యలో అత్యంత శక్తివంతమైన ‘మరోనియర్ కింగ్‌డమ్’ ఉంటుంది. ఆ దేశ జనరల్ అయిన బరిబారాకు ఏడుగురు కొడుకులు ఉంటారు. ఈ ఏడుగురు అన్నదమ్ములు ఆ రాజ్యానికి నైట్ కమాండర్స్ (శక్తివంతమైన యోధులు). ఇక్కడే అసలైన ఫాంటసీ ట్విస్ట్ ఉంది. ఈ ఏడుగురు రాకుమారులలో ఒక్కొక్కరికీ ఒక్కో విచిత్రమైన, విలక్షణమైన దైవిక శక్తి ఉంటుంది. ఈ ఏడుగురు అన్నదమ్ములు భవిష్యత్తులో ఒక అందమైన యువరాణిని రక్షించాలనే ఒకే ఒక పవిత్రమైన లక్ష్యంతో జీవిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో మరోనియర్ కింగ్‌డమ్ చుట్టూ ఉన్న ఏడు పొరుగు రాజ్యాలకు గుడ్‌విల్ అంబాసిడర్స్ (రాయబారులు) గా ఈ బ్రదర్స్ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఆ తెలియని వింత దేశాల్లో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అక్కడ ఉన్న వింత జీవులను, రాక్షసులను తమ విభిన్న శక్తులతో ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ అడ్వెంచరస్ యానిమే స్టోరీ. అద్భుతమైన విజువల్స్, నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సాగే ఈ సిరీస్ యానిమే లవర్స్ కి ఒక పర్ఫెక్ట్ విజువల్ ఫీస్ట్ లాంటిది.
ఈ యానిమే సిరీస్ 2026 అక్టోబర్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది జపనీస్, ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికైతే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఈ సిరీస్ లోని యానిమేషన్ క్వాలిటీ, ఫైట్ సీన్స్, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటాయి. ఏడుగురు బ్రదర్స్ మధ్య ఉండే ఫన్నీ బాండింగ్, అలాగే ఒక్కో రాజ్యంలో ఓపెన్ అయ్యే కొత్త ఫాంటసీ వరల్డ్ ఎలిమెంట్స్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ జపనీస్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ యానిమే లవర్స్‌కు ఖచ్చితంగా ఒక ‘ఫుల్ మీల్స్’ లాంటి ఎంటర్‌టైనర్.
Read Also: చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?