BigTV English
Advertisement

OTT Movie: రాజుగారి 99 మంది భార్యలను చంపే రాకాసి రాణి… ఓటీటీలో కేక పెట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie: రాజుగారి 99 మంది భార్యలను చంపే రాకాసి రాణి… ఓటీటీలో కేక పెట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : ఈ రోజు ఒక అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్ గురించి చెప్పుకోబోతున్నాము. గుజరాత్‌ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, రాణీవాడా గ్రామం ఒక దారుణమైన మంత్రగత్తె శాపం చీకటిలో కూరుకుపోతుంది. ఆ మంత్రగత్తె పేరు… జమ్కుడి! గర్భా ఆడటం బ్యాన్ చేసిన ఈ గ్రామంలో రూల్స్ పాటించని వారిని భయంకరంగా చంపేస్తారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ బబ్లో, రాజవంశ వారసురాలు కుముద్‌ లు ఈ శాపాన్ని ఎదుర్కొని గ్రామాన్ని రక్షించగలరా? ఈ హర్రర్-కామెడీ రోలర్‌ కోస్టర్‌లో రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే, కథలోకి డైవ్ చేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…

గుజరాత్‌ లోని రాణీవాడా గ్రామంలో నవరాత్రి సంబరాలు నిషేధం. ఎందుకంటే ఒక దుష్ట మంత్రగత్తె జమ్కుడి శాపం గ్రామాన్ని కమ్మేసింది. ఈ శాపం ప్రకారం, గర్భా ఆడితే భయంకర పరిణామాలు తప్పవు. అయితే కొంతమంది ఈ రూల్స్ ను పట్టించుకోకపోవడంతో ఈ గ్రామంలో భయంకరమైన హత్యలు మొదలవుతాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ బబ్లో (విరాజ్ ఘెలానీ), రాజవంశ వారసురాలు కుముద్ (మనసీ పరేఖ్) తమ తెలివితేటలతో ఈ శాపాన్ని ఎదుర్కోవడానికి గ్రామానికి తిరిగి వస్తారు. వాళ్ళు ఇద్దరూ జమ్కుడి రహస్యాన్ని కనిపెట్టి, గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో ఉత్కంఠ, కామెడీ, భయంతో నిండిన ఒక అడ్వెంచర్‌ లో పడతారు. ఈ కథలో గుజరాతీ సంస్కృతి, నవరాత్రి జోష్, సస్పెన్స్‌తో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. కామెడీ, హర్రర్, డ్రామా కలగలిపిన అద్భుతమైన ఈ సినిమాను గుజరాతీ సినిమా ప్రేమికులకు ఒక పండగలా చేస్తుంది.


Read Also : ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది… దెబ్బకు బిలియనీర్ ఐపోయింది మావా

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు జమ్కుడి (Jhamkudi). 2024లో విడుదలైన గుజరాతీ హర్రర్-కామెడీ డ్రామా ఇది. షెమరూ మీ (ShemarooMe)లో 2024 అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సినిమా థియేటర్లలో 2024 మే 31న విడుదలై, దాదాపు 25 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్‌ తో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా నిలిచింది. ఉమంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనసీ పరేఖ్, విరాజ్ ఘెలానీ, ఓజస్ రావల్, సంజయ్ గోరాడియా, చేతన్ దైయా, జయేష్ మోర్, కృణాల్ పండిత్, భవినీ జానీ తదితరులు నటించారు. పార్థివ్ గోహిల్, మనసీ పరేఖ్ నిర్మించిన ఈ సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివితో కామెడీ, హర్రర్, మిస్టరీ జానర్‌లలో రూపొందింది. గుజరాత్‌లోని గోండల్‌లోని 500 ఏళ్ల నాటి ప్యాలెస్‌లో సినిమా చిత్రీకరణ జరిగింది. ఇది సినిమాకు ప్రత్యేకమైన భయానక వాతావరణాన్ని జోడించింది. IMDbలో కూడా రేటింగ్ 7.9/10తో ఉంది. ఈ చిత్రం గుజరాతీ సంస్కృతిని అద్భుతంగా చూపిస్తూ, విజువల్ ఎఫెక్ట్, అఘోరి మ్యూజిక్ బృందం రీమిక్స్ చేసిన టైటిల్ ట్రాక్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×