BigTV English

OTT Movie: ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిపించి ఆ పని చేసే ప్రియుడు… దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే ‘విష్ణు ప్రియ’

OTT Movie: ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిపించి ఆ పని చేసే ప్రియుడు… దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే ‘విష్ణు ప్రియ’

OTT Movie : 1990ల నాటి చిన్న పట్టణంలో, ప్రేమ అనే అందమైన భావనలో మునిగిన ఓ యువ హృదయం… విష్ణు! కానీ ఈ ప్రేమ కథలో స్నేహం, త్యాగం, ఒక స్నేహితుడి మనసు మారి, శత్రుత్వం కలిసిన ఒక భావోద్వేగ రోలర్‌కోస్టర్‌ను సృష్టిస్తాయి. ప్రియతో విష్ణు ప్రేమ ఊహించిన విధంగా సాగుతుందా? లేక సమాజం, కుటుంబం, ద్రోహం ఈ ప్రేమను నరకంగా మారుస్తాయా? అనే విషయం తెలుసుకోవడానికి ఈ హార్ట్ టచింగ్ ప్రేమ కథలోకి డీప్ గా డైవ్ చేద్దాం!


కథలోకి వెళ్తే…

1990ల నాటి ఓ పట్టణంలో నడుస్తుంది స్టోరీ. విష్ణు (శ్రేయస్ మంజు), బాలు (నిహాల్ రాజ్ గౌడ) చిన్ననాటి స్నేహితులు. బాలు, ప్రియ (ప్రియా ప్రకాశ్ వారియర్)ని ప్రేమిస్తున్నట్లు విష్ణుతో చెబుతాడు. ఆమెకు ప్రపోజ్ చేయడానికి సహాయం అడుగుతాడు. కానీ ఈ విషయం విష్ణు ప్రియతో చెప్పినప్పుడు ఆమె తను బాలుని కాదు, విష్ణునే ప్రేమిస్తున్నట్లు వెల్లడిస్తుంది. స్నేహం, కొత్తగా వికసించిన ప్రేమ మధ్య చిక్కుకున్న విష్ణు, తన హృదయం చెప్పినట్టుగా వినాలని డిసైడ్ అవుతాడు. విష్, ప్రియ ప్రేమలో పడతారు, కానీ ఇది బాలు హృదయాన్ని బ్రేక్ చేస్తుంది. అతను దీన్ని పర్సనల్ గా తీసుకుంటాడు.


ఈ ప్రేమ కథ కాలేజీ రొమాన్స్‌ తో మొదలై, సమాజ ఒత్తిళ్లు, కుటుంబ అడ్డంకులు, బాలు ద్వేషంతో సవాళ్లను ఎదుర్కొంటుంది. విష్ణు, ప్రియను కలవడానికి నగరాలు తిరిగి, తన ప్రేమను నిరూపించడానికి అనేక అడ్డంకులను అధిగమిస్తాడు. ప్రియ తల్లిదండ్రుల వ్యతిరేకత, అపార్థాలు, బాలు కుట్రలు వారి ప్రేమను పరీక్షిస్తాయి. విష్ణు గతంలోని ఒక బాధాకరమైన కథ, తన తల్లి తీసుకున్న నిర్ణయాలు ఈ క్రమంలో బయట పడతాయి. ఈ కథలో మధురమైన క్షణాలు, చేతితో రాసిన లేఖలు, ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్, కాలేజీ క్యాంటీన్ వంటి సీన్స్ 1990ల నాటి ప్రేమ, ప్రేమికుల అమాయకత్వాన్ని అద్భుతంగా చూపిస్తాయి. సినిమా ఎమోషనల్ డ్రామా మాత్రమే కాదు యాక్షన్, నాస్టాల్జియాతో నిండి, విష్ణు – ప్రియ ప్రేమ విజయం సాధిస్తుందా ? అనే సస్పెన్స్ ను కలిగిస్తుంది. మరి ఇంతకీ వీళ్లిద్దరి ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్ళింది? చివరికి ఇద్దరూ కలుసుకున్నారా లేదా? బుర్ర పాడయ్యే ఆ క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Read Also ; ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది… దెబ్బకు బిలియనీర్ ఐపోయింది మావా

ఏ ఓటీటీలో ఉందంటే 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ‘Vishnu Priya’. 2025లోనే రిలీజ్ అయిన ఈ కన్నడ రొమాంటిక్ డ్రామా cలో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉంది. V.K. ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలై, 131 నిమిషాల నిడివితో, రవి శ్రీవత్స రచన మరియు K. మంజు నిర్మాణంలో రూపొందింది. శ్రేయస్ మంజు, ప్రియా ప్రకాశ్ వారియర్ (కన్నడ డెబ్యూ), అచ్యుత్ కుమార్, సుచేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ సంగీతం, A. వినోద్ భారతి సినిమాటోగ్రఫీ, మరియు సురేష్ ఉర్స్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసాయి. 1990ల కర్ణాటకలో చిత్రీకరించబడిన ఈ సినిమా, యాక్షన్, రొమాన్స్, మరియు ఫ్యామిలీ డ్రామా జానర్‌లలో, IMDbలో 7.0/10 రేటింగ్‌తో, 1990ల నాటి ప్రేమ యొక్క అమాయకత్వాన్ని, ల్యాండ్‌లైన్ కాల్స్, లేఖల ద్వారా అద్భుతంగా చూపిస్తుంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×