BigTV English

OTT Movie: నదిలో శవాలు … ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులు … మైండ్ బ్లాక్ అయ్యే స్పానిష్ సినిమా

OTT Movie: నదిలో శవాలు … ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులు …  మైండ్ బ్లాక్ అయ్యే స్పానిష్ సినిమా

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంత సేపూ ట్విస్టులతో అదరగొడతాయి. మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మేకర్స్ కళ్ళకు కట్టినట్టుగా చూపించడం వల్లే ఈ జానర్ సినిమాలపై క్యూరియారిసిటీని పెంచుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఈ మూవీ స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.


కథలోకి వెళ్తే…

ఫ్రాన్స్‌లోని ఆవెర్న్ అనే ప్రాంతంలోని అందమైన పావిన్ సరస్సు సమీపంలో ఒక యువతి మృతదేహం కనిపిస్తుంది. అదొక హత్య, పైగా క్రైమ్ సీన్ స్థానిక పురాణాన్ని పోలి ఉంటుంది. ఈ పురాణం ప్రకారం, బెస్సే గ్రామంలోని మత్స్యకారులు తమ పాపాల వల్ల దేవుడికి కోపం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పాపం భారం వల్ల వచ్చిన డెవిల్ కన్నీటితో పావిన్ సరస్సు ఏర్పడింది. ఇక పాపం చేసిన మత్స్యకారులు దాని కింద భూస్థాపితం అయ్యారని చెబుతారు. అయితే హంతకుడు ఈ యువతిని కూడా పాపిగా భావించి, పురాణాన్ని ఫాలో చేస్తూ హత్య చేసినట్లు పోలీసులు కనిపెడతారు.


కెప్టెన్ బ్రూనో రోమాగ్నాట్ (ఫ్రెడెరిక్ డిఫెంథాల్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. బ్రూనోకు బాధితురాలితో వ్యక్తిగత సంబంధం ఉంది. అందుకే ఆ ఇన్వెస్టిగేషన్ అతని దర్యాప్తును మరింత ఉద్వేగభరితం చేస్తుంది. అతనితో కలిసి లెఫ్టినెంట్ ఆరేలీ లెఫైవ్రే (సోఫియా ఎస్సాయిడి) కూడా ఈ కేసుపై పని చేస్తుంది. వీరిద్దరూ ఈ క్లిష్టమైన కేసులో హంతకుడి ఉద్దేశాలను, బాధితురాలి నేపథ్యాన్ని, స్థానిక పురాణం ప్రభావాన్ని వెలికితీస్తారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, బ్రూనో వ్యక్తిగత జీవితం, స్థానిక సమాజంలోని రహస్యాలు, పురాణం సాంస్కృతిక ప్రాముఖ్యత బయట పడతాయి. ఈ కథలో ఆవెర్న్ ప్రాంతం అద్భుతమైన దృశ్యాలు, ఉద్వేగభరితమైన డ్రామా, సస్పెన్స్‌తో కూడిన దర్యాప్తు హైలెట్ గా ఉంటాయి. అయితే అసలు హంతకుడు ఎందుకిలా హత్య చేశాడు? చివరికి పోలీసులు హంతకుడిని పట్టుకున్నారా? పట్టుకుంటే అతనెవరు ? అసలు చనిపోయిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఏం చేసింది? అనే వివరాలు తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : ఒక్క పాడు సీన్ లేదు… లవ్ స్టోరీ లేదా కమర్షియల్ కాదు… వందల కోట్లు కొల్లగొట్టిన సినిమా

ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సినిమా గురించి కాదు సిరీస్ గురించి. 2016లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ 2017 లో తెరపైకి వచ్చింది. దీని పేరు ‘Murder in Auvergne (Meurtres à Auvergne). ఈ క్రైమ్ డ్రామా 90 నిమిషాల పాటు సాగుతుంది. థియరీ బినిస్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామాలో ఫ్రెడెరిక్ డిఫెంథాల్, సోఫియా ఎస్సాయిడి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar )లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×